రెండోరోజూ జిల్లాలో జననేత
సాక్షి, రాజమండ్రి :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, శాసనసభలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజైన గురువారం కూడా కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. జగన్ బుధవారం మధ్యాహ్నం రాజమండ్రి చేరుకుని మోరంపూడి జంక్షన్‌లో గత ఆదివారం జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చి, గాయపడ్డ వారిని పరామర్శించిన విషయం తెలిసిందే. రాత్రి కాకినాడలో పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంట వివాహవేడుకల్లో పాల్గొని రాజమండ్రి తిరిగి వచ్చి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బస చేశారు. కాగా ఆయన గురువారం ఉదయం తొమ్మిదిన్నరకు రాజమండ్రి హోటల్ షెల్టన్‌లో పార్టీ నాయకుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కుమారుని వివాహ నిశ్చితార్థానికి హాజరయ్యారు. వేణు కుమారుడు నరేన్, కొవ్వూరు డీఎస్పీ రాజ్‌గోపాల్ కుమార్తె స్రవంతిల జంటను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ జిల్లా నేతలతో కాసేపు ముచ్చటించారు. వేణుగోపాలకృష్ణ వేదిక వద్ద ప్రముఖులను జగన్‌కు పరిచయం చేశారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ పూర్వపు జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి సతీసమేతంగా జగన్‌ను కలిశారు.
నరేన్, స్రవంతిల జంటకు ప్రముఖుల ఆశీస్సులు
నిశ్చితార్థ వేడుకకు జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు తరలి వచ్చారు. వీరిలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, శాసనమండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు, ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు, బొడ్డు భాస్కర రామారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, గొల్లపల్లి సూర్యారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, కె.ఎస్.జవహర్, ఆరుమిల్లి రాధాకృష్ణ, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, డీసీఎంఎస్ చైర్మన్ కె.వి.సత్యనారాయణరెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీలు గిరజాల వెంకటస్వామినాయుడు, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, గొల్ల బాబూరావు, బండారు సత్యానందరావు, అల్లూరు కృష్ణంరాజు, పాముల రాజేశ్వరి, రాపాక వరప్రసాద్,
వైఎస్సార్ సీపీ కాకినాడ, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చలమలశెట్టి సునీల్, పినిపే విశ్వరూప్, రాష్ట్ర కార్యద ర్శులు జక్కంపూడి రాజా, కొల్లి నిర్మల కుమారి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, రాజమండ్రి నగర పాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలా అనిల్‌రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల దుర్గేశ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, సీసీసీ ఛానల్ ఎండీ పంతం కొండలరావు తదితరులు హాజరై నరేన్, స్రవంతిలను ఆశీర్వదించారు.కాగా రాజమండ్రిలో జగన్.. ఇటీవల తండ్రిని కోల్పోయిన పార్టీ నేత అ డపా హరి ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. హోటల్ షెల్టన్ నుంచి హరి ఇంటికి చేరుకున్న జగన్ ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి అడపా శాంతారామ్ నాలుగు నెలల క్రితం మరణించిన విషయం తెలిసిందే. హరి సతీమణి ప్రియ, కుమారులు అభిరామ్, బన్నులతో జగన్ కాసేపు మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి నేతలు వెంట రాగా మధురపూడి విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
అధినేతను కలుసుకున్న జిల్లా పార్టీ శ్రేణులు
జగన్‌ను కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉదయం తొమ్మిది గం టలకే ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ పలువురిని కలిసిన జగన్ అనంతరం విమానాశ్రయానికి బయలుదేరారు. పలువురు నేతలు విమా నాశ్రయానికి వెళ్లి జగన్‌కు వీడ్కోలు పలికారు. పర్యటనలో జగన్ వెంట జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మె ల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వ రుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, వం తల రాజేశ్వరి, మాజీ మంత్రి పిల్లి సు భాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, కుడుపూడి చిట్టబ్బాయి,
గొ ల్ల బాబూరావు, కాకినాడ పార్లమెంట్ ని యోజకవర్గ నాయకులు చలమలశెట్టి సు నీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కం పూడి రాజా, కొల్లి నిర్మలకుమారి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, కో ఆ ర్డినేటర్లు ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, రాజమండ్రి నగర ఫ్లోర్‌లీడర్ మే డపాటి షర్మిలా అనిల్‌రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, జిల్లా విభాగా ల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనం త ఉదయ్‌భాస్కర్, గారపాటి అనంద్, శె ట్టిబత్తుల రాజబాబు, మార్గన గంగాధర్, యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యు లు తాడి విజయభాస్కరరెడ్డి, పార్టీ నా యకులు విప్పర్తి వేణుగోపాల్, మిండగుదిటి మోహన్, రావిపాటి రామచంద్రరా వు, నక్కా రాజబాబు, ఆదిరెడ్డి వాసు, క డితి జోగారావు, ఆర్‌వీవీ సత్యనారాయ ణ చౌదరి, గుర్రం గౌతమ్, జక్కంపూడి గణేష్, అడపా హరి, పోలు కిరణ్‌మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.