ప్రకాశం(కంభం): పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని రాయపాడు గ్రామంలో ఓ పిచ్చ కుక్క దాదాపు 15 మందిపై దాడి చేసింది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అయితే బాధితులకు ఇచ్చే రేబిస్ వ్యాక్సిన్ స్థానిక ఆస్పత్రిలో లేకపోవడంతో వారిని మార్కాపురం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. దీంతో 25 కి.మీ ప్రయాణించి చికిత్స తీసుకోవాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.