సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 1,91,874 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 10,730 టెస్టులు నిర్వహించారు. 10 లక్షల జనాభాకు 3,593 పరీక్షలతో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల రేటు 4.02 శాతం నమోదవుతుంటే.. ఏపీలో 1.07 శాతంగా ఉంది.
రాష్ట్రంలో రికవరీ రేటు రికార్డు స్థాయిలో 51.49 శాతంగా నమోదయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి కోలుకొని 1056 మంది డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 31.86 శాతం కాగా.. ఏపీలో 51.49 శాతంగా రికవరీ రేటు ఉంది. మరణాల రేటు కూడా దేశీయ సగటు కంటే తక్కువగా ఏపీలో 2.24 శాతంగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. చదవండి: ఆగస్టు నాటికి లక్షా 35 వేల కరోనా మరణాలు!
Comments
Please login to add a commentAdd a comment