
సాక్షి, ప్రకాశం : వైఎస్సార్‌సీపీతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జీ ఐవీ రెడ్డి పేర్కొన్నారు. బెస్తవారిపేట పట్టణంలోని 200 మంది యువకులను కడ్డువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐవీ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమొత్తంలో యువత పార్టీలోకి చేరడం శుభపరిణామం అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం యువత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బెస్తవారిపెట మండల కన్వీనర్ బొల్ల బాలి రెడ్డి, పట్టణ కన్వీనర్ కొండా రఘునాద్ రెడ్డి, జిల్లా బీసి సెల్ విభాగం మోగులురి భీమయ్య యాదవ్, కోటయ్య, వినోద్, జిల్లా సాంసృతిక అధ్యక్షులు కొండా తిరుపతి రెడ్డి, యంవి సుబ్బా రెడ్డి, నాగరాజు, మరియు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)