IV reddy
-
వైఎస్సార్సీపీలోకి చేరిన 200 మంది యువత
-
వైఎస్సార్సీపీలోకి చేరిన 200 మంది యువత
సాక్షి, ప్రకాశం : వైఎస్సార్‌సీపీతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జీ ఐవీ రెడ్డి పేర్కొన్నారు. బెస్తవారిపేట పట్టణంలోని 200 మంది యువకులను కడ్డువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐవీ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమొత్తంలో యువత పార్టీలోకి చేరడం శుభపరిణామం అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం యువత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బెస్తవారిపెట మండల కన్వీనర్ బొల్ల బాలి రెడ్డి, పట్టణ కన్వీనర్ కొండా రఘునాద్ రెడ్డి, జిల్లా బీసి సెల్ విభాగం మోగులురి భీమయ్య యాదవ్, కోటయ్య, వినోద్, జిల్లా సాంసృతిక అధ్యక్షులు కొండా తిరుపతి రెడ్డి, యంవి సుబ్బా రెడ్డి, నాగరాజు, మరియు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీడీపీ బీజేపీ కలిసి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు: ఐవీ రెడ్డి
-
‘చంద్రబాబు చేతుల్లో ప్రజాస్వామ్యం హతం’
సాక్షి, ఒంగోలు : ‘అనునిత్యం విలువలతో కూడి రాజకీయం చేస్తాను, విలువలతో కూడిన రాజకీయం చేస్తాను అని.. చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటారు. మరి ఆ విలువలతో కూడిన రాజకీయం అంటే.. ఎమ్మెల్యేలకు వెల కట్టి కొనుక్కోవడమేనా? ఒక్క ఎమ్మెల్యేను పాతిక కోట్ల రూపాయలకు కొనడమా? ఇదేనా ప్రజాస్వామ్యం? చంద్రబాబు అలాంటి చీప్ పొలిటీషియన్ చేతిలో భారత ప్రజాస్వామ్యం హతం అవుతోంది. అనునిత్యం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యంగ స్ఫూర్తికి తూట్లు పొడుతూ.. చంద్రబాబు నీచ రాజకీయానికి పాల్పడుతున్నారు...’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు ఇన్చార్జ్ ఐవీ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ మరో ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఐవీ రెడ్డి సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు కొనుగోలు రాజకీయాలు చేస్తున్నరు, ఆయనకు దమ్మూ ధైర్యం ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ‘ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీ వైపు ఫిరాయిస్తున్న వాళ్లు రాజకీయ నీచులు. అధికారం, ధనకాంక్షలతో అనైతిక చర్యకు పాల్పడుతున్నారు. అంతగా అధికార పార్టీలోకి వెళ్లాలి అనుకుంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి వారు రాజీనామా చేయాలి. దమ్మూధైర్యం ఉంటే.. మళ్లీ పోటీకి సిద్ధం కావాలి. దారుణం ఏమిటంటే.. అలాంటి దమ్మూ, ధైర్యం, సిగ్గూ శరం అటు.. చంద్రబాబు నాయుడికీ లేవు.. ఇటు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలకూ లేవు. ఇలాంటి హీనులనా మనం ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంది అని వీరికి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇలాంటి ఫిరాయింపు నీచ రాజకీయానికి పాల్పడిన వారికి అయినా, వీళ్ల చేత ఇలాంటి పని చేయిస్తున్న చంద్రబాబుకు అయినా రేపటి ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యవిలువలను ఎంతగా పాతరేసినా.. ఈ పాపానికంతటికీ తగిన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల రూపంలో ప్రజాతీర్పును ఎదుర్కొనడానికి మరెంతో దూరం లేదు. అలాంటి సమయంలో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’ అని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలోనూ.. అధికార, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలందరికీ అభివృద్ధి ఇచ్చారు. అప్పటికీ ఇప్పటికీ తేడా.. నక్కకూ నాకలోకానికి ఉన్నం తేడా ఉంది. చంద్రబాబువి గుంట నక్క రాజకీయాలు. ఫిరాయింపుదారులు, వీళ్ల ట్రూపుకు పెద్ద చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మోసం చేయవచ్చు. ఇదంతా తాత్కాలికమే. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోలేని చేతగాని రాజ్యాంగ వ్యవస్థ ఉండవచ్చు. కానీ.. ఈ మోసం కలకాలం సాగదని గుర్తుంచుకోవాలి. ఇంత చేసినా మరో ఏడాది మాత్రమే.. తర్వాత అంతిమ తీర్పు వస్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రజా కోర్టులో తీవ్రమైన శిక్షను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని చంద్రబాబు కలలు కంటున్నట్టుగా ఉన్నాడు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతోనే అది జరుగుతుందని బాబు అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. అది కేవలం పగటి కల మాత్రమే అని ఆయన గుర్తుంచుకోవాలి...’ అని ఐవి రెడ్డి హెచ్చరించారు. -
వైఎస్ఆర్కు భారతరత్న ఇవ్వాలి
► గిద్దలూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఐవీ రెడ్డి ► పార్టీ ప్లీనరీలో తీర్మానం గిద్దలూరు: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం మీద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలను ఏ ముఖ్యమంత్రీ ప్రవేశపెట్టలేదని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి ఐవీ రెడ్డి అన్నారు. ఓ అవ్వ, తాతనో అడిగితే ఆరోగ్యశ్రీ పథకం తమ పేద గుండెలకు ఎంత మంచి చేసిందో చెబుతారని, హైదరాబాద్, బెంగళూరు, పుణె లాంటి నగరాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువకులను అడిగితే ఫీజు రీయింబర్స్ మెంట్ తమకు ఎలా దారి చూపించిందో, తమ జీవితాలను ఎలా చక్కదిద్దిందో చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఇంతటి బ్రహ్మాండమైన పథకాలు అనేకం ప్రవేశపెట్టి, వాటిని దిగ్విజయంగా అమలుచేసిన దివంగత మహానేత వైఎస్ఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ప్లీనరీ సమావేశ సందర్భంగా ఆయన ఈ మేరకు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని నాయకులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. తారతమ్యం లేకుండా అందరి అభ్యున్నతికి పాటు పడి తన పాలనలో ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించాలనే ఉన్నత ఆశయంతో సేవ చేసిన రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని, ప్రజలంతా కోరుకుంటున్న ఈ విషయాన్ని తాను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నానని ఐవీ రెడ్డి తెలిపారు. వైఎస్ పాలనలో రైతన్నల మేలు కోసం తలపెట్టిన ఎన్నో ప్రాజెక్టులు మురుగున పడి నిర్వీర్యం అవుతున్నాయని, 108 సక్రమంగా పనిచేయక ప్రమాదాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల క్షేమం కన్నా తన కుటుంబ సభ్యుల క్షేమమే తనకు ముఖ్యమనే చంద్రబాబు కొడుక్కి మంత్రి పదవి దక్కడం కోసం ఎంత అడ్డదారులు తొక్కారో అందరికి తెలిసిన చరిత్రేనని విమర్శించారు. -
వైఎస్ఆర్సీపీలో టీడీపీ నేతల చేరిక
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంభం మండలం పెద్ద నల్లకాల్వ గ్రామానికి చెందిన 50 మంది వరకు నేతలు, కార్యకర్తలు మంగళవారం నాడు వైఎస్ఆర్సీపీలో చేరారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గ ఇన్చార్జి ఐవీ రెడ్డితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వాళ్లు తెలిపారు. నాయకులకు ఐవీ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కంభం మండల పార్టీ కన్వీనర్ రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కంభం మండల వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
హత్యా రాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్నారు: ఐవీ రెడ్డి
కళకళలాడాల్సిన రాష్ట్రాన్ని టీడీపీ నేతలు, వారి అనుచరులు హత్యారాజకీయాలతో భ్రష్టు పట్టిస్తున్నారని గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఐవీ రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణ హత్యను ఆయన ఖండించారు. రాజకీయంగా ఎదుగుతూ పట్టు సాధిస్తున్న క్రమంలో ఆయన ఎదుగుదలను ఓర్వలేక.. నిరాయుధుడిగా ఉన్న సమయంలో ఇలా హత్యకు తెగబడటం చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలను పోలీసుల సాక్షిగా బాబు, లోకేష్ సమాధి చేసినట్టు మరోసారి రుజువయ్యిందని, ఇంతటి అరాచక ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలోను చూసి ఉండరని ఆయన మండిపడ్డారు. బాబు సర్కార్ ప్రోత్సహిస్తున్న హత్యా రాజకీయాలకు ప్రజలు చెల్లుచీటీ పలికే తరుణం దగ్గరలోనే ఉందని చెప్పారు. చెరుకులపాడు నారాయణరెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఐవీ రెడ్డి గుర్తు చేసుకున్నారు. -
టీడీపీ అంటే టోటల్ డీఫాల్టర్ పార్టీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గిద్దలూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఐవీ రెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీని టోటల్ డీఫాల్టర్ పార్టీగా మార్చి భ్రష్టు పట్టించిన ఘనత ఆయనకే దక్కుతుందని విరుచుకుపడ్డారు. వాకాటి నారాయణరెడ్డిని సస్పెండ్ చేసి ఏదో గొప్ప పని చేసుకుంటున్నట్లు చెప్పుకొంటున్న చంద్రబాబు.. అదే పార్టీ నుంచి ఎంపీగా ఉన్న సుజనా చౌదరి విషయంలో ఏం చేశారని ప్రశ్నించారు. తమ బ్యాంకుల వద్ద సుజనా తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాంటూ చివరకు బ్యాంకు సిబ్బంది ఆయన ఇంటి ఎదుట రోడ్డు మీద ధర్నా చేసేవరకు తెచ్చుకున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో సైతం భూకబ్జాలకు తెగబడితే స్థానికులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఆయన తోకముడిచారని, అలాంటి వాళ్ల మీద చర్యలేవని ఐవీ రెడ్డి ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి కుమారుడే కర్నూలు జిల్లాలో ఇసుక దోపిడీకి తెగబడితే చివరికి కోర్టు జోక్యం చేసుకుని కలెక్టర్‌కు అక్షింతలు వేసే దాకా వచ్చిందని, వీళ్ల మీద ఏదైనా చర్యలు తీసుకుంటే అందరు హర్షిస్తారన్నారు. తెరమీద సస్పెండ్ చేసినట్లు చూపించి, తెరవెనుక కావాల్సిన వారిని దువ్వుతూ కూర్చోవడం చంద్రబాబు నైజమని విమర్శించారు. ముందు నుంచి అవినీతికి కొమ్ము కాస్తూ ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా కథలు చెప్పడం చందమామను అద్దంలో చూపించి నిజమనుకునేంత కామెడీగా ఉందని చురక వేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్న అవినీతిపరులందరినీ తన బృందంలో ఉంచుకుని తన అవినీతిని ప్రశ్నించినవారిపై బురద చల్లడం మానుకోకపోతే ఎన్నికలలో సిట్టింగ్ ఎమెల్యేలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. తెలుగు తమ్ముళ్ల అవినీతి మొత్తం నాయకుడైన బాబు ఆధ్వర్యంలోనే జరిగిందని ఇప్పుడు కొత్తగా చిలక పలుకులు చెబితే ఎవరు నమ్మే స్థితిలో లేరని అన్నారు. అవినీతిని పెరట్లో ఉంచుకుని ఇలా చెలరేగుతున్న బాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఐవీ రెడ్డి జోస్యం చెప్పారు. -
వైఎస్ఆర్ సీపీలోకి గిద్దలూరు కౌన్సిలర్లు
గిద్దలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ప్రజానేతగా జనం గుండెల్లో చిరకాలం అమరుడిగా నిలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను తన భుజ స్కందాలపై మోస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకుని పలువురు గిద్దలూరు నియోజకవర్గ ప్రముఖులు బుధవారం వైఎస్ఆర్ పార్టీలో చేరారు. కౌన్సిలర్లు బిల్ జయలక్ష్మి, షేక్ జమ్రుతి, ఇప్పాల వెంకటేశ్వరులు, గవురమ్మ, మాజీ కౌన్సిలర్లు బిల్ల రమేష్ యాదవ్,వెంకట్ రావు, అల్తాఫ్తో పాటు టిడిపి కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకున్నారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ ఐ.వీ.రెడ్డి ఆధ్వర్యంలో లోటస్ పాండ్‌లో ఈ రోజు మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరితో పాటు పలువురు ఐటి ఉద్యోగులు వైఎస్ జగన్‌ను కలిసారు. కాగా గిద్దలూరులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పలురకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఐవీ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టిడిపిలో ఒక్క కార్యకర్త కూడా మిగిలి ఉండే అవకాశం లేదని, అందరు మంచి భవిష్యత్ కోసం వైఎస్ఆర్ పార్టీ వైపే చూస్తున్నారని అన్నారు. -
టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం
‘గిద్దలూరు’ వైఎస్సార్ సీపీకి కంచుకోట ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆ పార్టీకే పట్టం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి జగన్ సీఎం కావడమే లక్ష్యం : చేగిరెడ్డి లింగారెడ్డి కంభం: గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు తమ పార్టీకే పట్టం కడతారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సీఎల్ఆర్ కాంప్లెక్స్ ఆవరణలో మంగళవారం పార్టీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన అశోక్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని సీఎం చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. పార్టీ నేత చేగిరెడ్డి లింగారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు, సమన్వయకర్త ఐ.వి.రెడ్డికి పూర్తి మద్దతుగా నిలుస్తానన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడమే తమ లక్ష్యమన్నారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ డాక్టర్ రంగారెడ్డి, కంభం, బేస్తవారిపేట, కొమరోలు మండల కన్వీనర్లు గొంగటి చెన్నారెడ్డి, బాలిరెడ్డి, సార్వభౌమరావు, పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొండా తిరుపతిరెడ్డి, సెక్రటరీ ఖమర్, టీవీఎస్పీ శర్మ, మాజీ ఎంపీపీ వెంకటరాజు, కంభం ఎంపీటీసీ సభ్యుడు చిక్కుడు రోశయ్య, పట్టణ అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు.