రాజుకున్న రాజకీయం | 2013 review | Sakshi
Sakshi News home page

రాజుకున్న రాజకీయం

Published Sun, Dec 29 2013 3:44 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

2013 review

జిల్లాలో ఈ ఏడాది రాజకీయం రసవత్తర మలుపులు తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో ప్రధాన పార్టీల జాతకాలు మారిపోయాయి. మరోవైపు నేతల వ్యక్తిగత ప్రతిష్ట కూడా దెబ్బతింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో రోజురోజుకూ పుంజుకుంటూ ఉండగా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అందుకు విభిన్నంగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల కాంగ్రెస్ నాయకుల ప్రతిష్ట దెబ్బతింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉంది. లోక్‌సత్తా, వామపక్షాలు తదితర పార్టీలు ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నించాయి. 
 
 బొబ్బిలి, న్యూస్‌లైన్: జిల్లాలో రాజకీయం రంగులు మారింది. ఇంతకాలం అధికార పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నెత్తిన వేసుకుని ప్రజా సమస్యలపై గళమెత్తింది. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల విధానానికి జిల్లాలోనూ వ్యతిరేకత వ్యక్తమైంది. మాజీ ఎమ్మెల్యే తాడ్డి వెంకటరావు మరణం ఆయన అభిమానులను దుఃఖ సాగర ంలో ముంచింది.  
 
 కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ 
 రాష్ట్రంపై విభజన కత్తిని వేలాడదీసిన కాంగ్రెస్‌కు జిల్లాలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఆఖరుకు ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా ‘రాజీ’నామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ ‘తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంట’ని ప్రకటన చేసినప్పుడే నిరసనలు మొదలయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయ్యాక ఆ నిరసనలు మరింత ఎక్కువై బొత్స ఆస్తుల విధ్వంసానికి దారి తీశాయి. దీంతో జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ కూడా పెట్టారు. దీంతో అధికార పార్టీపై ప్రజ లు మరింత రగిలిపోయారు. ఈ పరిణామాలన్నీ సత్తిబాబు ప్రతిష్టను దారుణంగా దెబ్బతీశాయి. సమైక్య రాష్ట్రాన్ని బలపరుస్తూ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ఎంపీ ఝాన్సీని కూడా సమైక్యవాదులు నిలదీశారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి యత్నిస్తున్న కాం గ్రెస్ పార్టీకి ప్రజల్లో విలువ లేదని గుర్తిం చి ఆ పార్టీకి చెందిన సాలూరు ఎమ్మెల్యే పీ డిక రాజన్న దొర వైఎ  స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం రాష్ట్ర స్థాయిలో సంచలనం అయ్యింది.  ఆ యన వెంట పలువురు స ర్పంచ్‌లు, మాజీలు సైతం కాం గ్రెస్‌కు గుడ్‌బై చెప్పి రాజన్న వెం ట నడవడం సాలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. 
 
 వైఎస్‌ఆర్ సీపీ దూకుడు
 ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా ఈ ఏడాది వైఎస్‌ఆర్ సీపీ ముందడుగు వేసింది. ఓ వైపు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాటాల్లో పాల్గొంది. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు కాంగ్రెస్‌ను వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత జిల్లాలో పార్టీ రోజు రోజుకూ బలోపేతం అవుతోంది. ఆయన సోదరుడు ఆర్వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) అరుకు పార్లమెంటు పరిశీలకులుగా నియమితులయ్యారు. అలాగే పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు పెద్దరికానికి వీరిద్దరూ అండగా ఉంటూ జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. సమైక్యాంధ్ర ధ్యేయంగా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు విశేషంగా స్పందించారు. అన్నింటి కంటే ప్రధానంగా ఈ ఏడాది జిల్లాలో జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల నిర్వహించిన పాదయాత్ర చిన్నపాటి సంచలనాన్ని సృష్టించింది. ఈ పాదయాత్రతో గ్రామగ్రామాన వైఎస్‌ఆర్‌సీపీకి బలమైన క్యాడర్ రూపొందినట్లైంది. సమై క్య శంఖారావం పేరుతో నిర్వహించిన యా త్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఏడాది చివరలో సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అధికార కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీకి మరింత ఊపు వచ్చింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తుఫాను ప్రాంతాల్లో పర్యటించి నష్టపోయిన వారిలో మనోధైర్యం నింపారు.
 
 అయోమయ ‘దేశం’
 రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడానికి లేఖలు రాసి, ఆనక సమన్యాయం అంటూ కొత్త రాగాన్ని ఎత్తుకున్న తెలుగుదేశం పార్టీకి జిల్లాలోనూ నిరసనలు తప్పలేదు. సమైక్యాంధ్ర అంటూ హడావుడి చేస్తున్న సమయంలోనే ఆ పార్టీ అధినేత సమన్యాయం అని చెప్పడంతో పార్టీ ప్రజలకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ పరాజయం వైపు పయనిస్తుండడం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలోపేతం అవుతుండడంతో సమైక్యాంధ్ర ఉద్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి మేమూ ఉన్నామని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ నానా ఇబ్బందులు పడుతోంది. ఈ పార్టీలో కూడా నాయకత్వంతో పాటు నియోజవకవర్గాల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. క్యాడర్‌ను నిలబెట్టుకోవడానికి నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే పార్టీలోని విబేధాలు కోలుకోనీయకుండా చేస్తున్నాయి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement