27నుంచి బైబిల్ మిషన్ ఉత్సవాలు | 27 Bible Mission celebrations | Sakshi
Sakshi News home page

27నుంచి బైబిల్ మిషన్ ఉత్సవాలు

Published Fri, Jan 24 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

27  Bible Mission celebrations

పెదకాకాని, న్యూస్‌లైన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న విశాల స్థలంలో ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు 76వ బైబిల్ మిషన్ మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్సవాల కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ జె.శామ్యూల్‌కిరణ్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తజనానికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో విశాల పందిళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. మహోత్సవాలు విజయవంతం కావాలని కోరుతూ గురువారం సభల పందిళ్లలో స్త్రీల సభల కన్వీనర్ జె.ప్రమీలాసెల్వరాజ్, జె.రీనాలు ఉపపాస ప్రార్థనలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement