సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 66వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా ‘సంక్రాంతి సంబరాలు’ 3 డి శకటాన్ని ప్రదర్శించనున్నట్లు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. పరేడ్‌లో ప్రదర్శన కోసం రక్షణ శాఖకు అందిన 50 దరఖాస్తుల్లో ఏపీ శకటానికి అవకాశం లభించడం తెలుగువారికి సంతోషకరమన్నారు.
ఏపీభవన్‌లో సోమవారం విలేకరుల సమావేశం సందర్భంగా ‘సంక్రాంతి సంబ రాలు’ 3డి శకటం నమూనాను ప్రదర్శించారు. ‘సూర్యుడు ఉదయించే రాష్ట్రం’, ‘సంక్రాంతి సంబరాలు’, ‘కూచిపూడి నృత్యం’ థీమ్‌లతో రక్షణ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు కంభంపాటి చెప్పారు. యూపీఏ హయాంలో పల్లంరాజు రక్షణ శాఖ సహాయ మంత్రిగా ఉన్నా శకటం ప్రదర్శనకు అవకాశం రాలేదన్నారు.
‘గణతంత్రం’లో ‘సంక్రాంతి’
Published Tue, Dec 23 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement
Advertisement