Kambhampati Rammohan rao
-
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్టయినా జాతీయ పార్టీల నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఎలాగైనా వారితో మాట్లాడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు లాబీయింగ్ చేసి మరీ స్పందించాలని కోరడంతోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్, అకాలీదళ్ నేత సుఖబీర్‌సింగ్ బాదల్ స్పందించినట్టు తెలుస్తోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు అరెస్టయి నాలుగురోజులైనా ఆయనకు జాతీయ స్థాయిలో కనీసమద్దతు లభించలేదు. ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీల నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి రామ్మోహనరావు ఢిల్లీలో తనకు తెలిసిన వారందరినీ కలిసి చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడాలని కోరుతున్నట్టు తెలిసింది. తనకు తెలిసిన ఎంపీల ద్వారా మమతా బెనర్జీని బతిమలాడటంతో ఆమె మొక్కుబడిగా స్పందించారు. అఖిలేశ్‌ను కూడా టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో ఆయన ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. సుఖబీర్‌సింగ్ బాదల్ కూడా లాబీయింగ్ వల్లే మూడురోజుల తర్వాత స్పందించారు. పట్టించుకోని జాతీయ పార్టీలు వివిధ జాతీయపార్టీలు, నేతలతో చంద్రబాబుకు సంబంధాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా జాతీయ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. జాతీయ రాజకీయాలను ఎప్పుడూ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, అవకాశవాదం కోసం ఉపయోగించడంతో ఆయన నమ్మదగని నేతగా ముద్రపడ్డారు. ప్రస్తుతం అన్ని పార్టీలు ఆయన్ను దూరం పెట్టాయి. అటు ఎన్డీయే దగ్గరకు రానీయడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఏ కూటమిని అయినా తన రాజకీయ అవసరాల కోసమే వాడుకోవడంతో ఇప్పుడు ఆయన దేశ రాజకీయాల్లో ఏకాకిగా మారిపోయారనే వాదన వినిపిస్తోంది. మద్దతు కోసం ఢిల్లీలో లాబీయింగ్ చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి, బీజేపీలోని ఆయన కోవర్టులు సీఎం రమేష్, సుజనాచౌదరి వంటి నేతలు చంద్రబాబుకు అనుకూలంగా లాబీయింగ్‌కు దిగారు. అయినా ఆశించినస్థాయిలో జాతీయనేతలు చంద్రబాబుకు మద్దతు పలకలేదు. కనీసం మరికొంత మందితో అయినా ట్వీట్లు చేయించాలనే ఉద్దేశంతో ఢిల్లీలో తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది. -
టీడీపీ నేత కంభంపాటి అక్రమకట్టడం కూల్చివేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మెహనరావు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అక్రమంగా కట్టిన కట్టడాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చేశారు. రామ్మోహనరావు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. ఆయన తన ఇంటికి ముందు భాగంలో రోడ్డుమీద అక్రమంగా నిర్మాణం చేస్తున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనికి స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయమే ఆ కట్టడాన్ని కూల్చేశారు. ఇటీవలి కాలంలో అక్రమ కట్టడాల విషయంలో జీహెచ్ఎంసీ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. కూకట్ పల్లి, పాతబస్తీ తదితర ప్రాంతాలలో తమకు ఫిర్యాదులు రాగానే వెంటనే చర్యలు తీసుకుంటోంది. గత వారం 15 రోజులుగా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తమపై వచ్చే రాజకీయ ఒత్తిళ్లను కూడా పక్కనపెట్టి కూల్చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమం కాదు.. నేనే కూల్చేశా: కంభంపాటి కాగా, అది అక్రమ నిర్మాణం కాదని.. ఇంటి బయట వాచ్ మన్ నివాసం కోసం చిన్న గదిలాంటిది కట్టిస్తుండగా జీహెచ్ఎంసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారని కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. దాంతో తానే మనుషులను పెట్టి దాన్ని కూల్చేసినట్లు ఆయన చెప్పారు. -
కంభంపాటికి కేకు తినిపించిన చంద్రబాబు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహనరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని రామ్మోహనరావుకు కేకు తినిపించారు. ఈ సందర్భంగా కంభంపాటికి 59వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఇవాళ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన విషయం తెలిసిందే. -
86 సార్లు కలిశాం
* ‘విభజన’ హామీల అమలుపై కేంద్రంతో రాష్ట్రం సంప్రదింపులపై కంభంపాటి * ఈ విషయాలన్నీ పవన్‌కల్యాణ్‌కు తెలిసి ఉండకపోవచ్చు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టం-2014లో పొందుపరిచిన హామీలు, ఇతరత్రా సమస్యలపై రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో వందలాదిసార్లు సంప్రదింపులు జరిపిందని, ఇందులో 86 సార్లు ప్రత్యక్షంగా వివిధ కేంద్రమంత్రులను కలిశామని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు చెప్పారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో టీడీపీ ప్రభుత్వం ఎలా సంప్రదింపులు జరిపింది? ఏమేం సాధించిందీ ఏకరువు పెట్టారు. ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తాను బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రగతిని వివరిస్తున్నానని చెప్పినా.. టీడీపీ ఎంపీలు ఏంచేశారంటూ సినీనటుడు పవన్‌కల్యాణ్ చేసిన విమర్శలకు కౌంటర్‌గానే ఈ వివరాలు వెల్లడించినట్టు అవగతమైంది. ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించగా.. ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం అనలేదని, ఇస్తామనే చెబుతోందని, బహుశా బిహార్ ఎన్నికల అనంతరం ఇస్తారేమోనని ఆయన బదులిచ్చారు. టీడీపీ ఎంపీల పనితీరును పవన్‌కల్యాణ్ తప్పుబట్టడాన్ని ప్రస్తావించగా.. ‘అది తప్పుపట్టడమని ఎందుకనుకోవాలి. ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు (ఆయన నోటీసులో ఉండకపోవచ్చు)’ అని కంభంపాటి అన్నారు. -
ఏపీ భవన్లో గణతంత్ర వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలను సోమవారం ఉదయం ఏపీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు ఈ సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏపీ పోలీస్ బెటాలియన్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఎకే. సింఘాల్, అదనపు రెసిడెంట్ కమిషనర్ డా.అర్జశ్రీకాంత్, ఏపీ భవన్ సిబ్బంబది, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో సీఎం స్విట్జర్లాండ్ పర్యటన
చంద్రబాబుతో పాటు మంత్రి యనమల, కంభంపాటి సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగర పర్యటనకు వెళుతున్నారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్‌వి ప్రసాద్, పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వెంకయ్య చౌదరి దావోస్‌కు వెళ్లనున్నారు. -
‘గణతంత్రం’లో ‘సంక్రాంతి’
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 66వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా ‘సంక్రాంతి సంబరాలు’ 3 డి శకటాన్ని ప్రదర్శించనున్నట్లు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు. పరేడ్‌లో ప్రదర్శన కోసం రక్షణ శాఖకు అందిన 50 దరఖాస్తుల్లో ఏపీ శకటానికి అవకాశం లభించడం తెలుగువారికి సంతోషకరమన్నారు. ఏపీభవన్‌లో సోమవారం విలేకరుల సమావేశం సందర్భంగా ‘సంక్రాంతి సంబ రాలు’ 3డి శకటం నమూనాను ప్రదర్శించారు. ‘సూర్యుడు ఉదయించే రాష్ట్రం’, ‘సంక్రాంతి సంబరాలు’, ‘కూచిపూడి నృత్యం’ థీమ్‌లతో రక్షణ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు కంభంపాటి చెప్పారు. యూపీఏ హయాంలో పల్లంరాజు రక్షణ శాఖ సహాయ మంత్రిగా ఉన్నా శకటం ప్రదర్శనకు అవకాశం రాలేదన్నారు. -
'కిడ్నాపైన ఇంజినీర్లను రక్షించండి'
హైదరాబాద్: నాగాలాండ్‌లో కిడ్నాపైన విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజినీర్ల విడుదల కోసం ఆంధ్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఆ ఇంజినీర్లు విడుదలకు చర్యలు చేపట్టాలని నాగాలాండ్ ప్రభుత్వంతో చర్చించినట్లు న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు వెల్లడించారు. వారి విడుదలపై నాగాలాండ్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుతున్నామని తెలిపారు. నాగాలాండ్‌లోని పృధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో విజయవాడకు చెందిన ఇంజినీర్లు ప్రదీశ్ చంద్ర, రఘులు సూపర్ వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన వారు స్వస్థలం విజయవాడకు బయలుదేరేందుకు నాగాలాండ్‌లోని దిమాపూర్ చేరుకున్నారు. ఆ క్రమంలో ఆ ఇద్దరు ఇంజనీర్లతోపాటు మరో వ్యక్తిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అయితే ముగ్గురులో ఓ వ్యక్తి కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని... కిడ్నాపైన ఇంజినీర్ల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దాంతో వారు పృధ్వీ కన్స్ట్రక్షన్ యాజమాన్యంతో సంప్రదించారు. రఘు, ప్రతీశ్ చంద్రలు కిడ్నాప్ అయిన విషయం నిజమేనని.... వారిని విడుదల చేయాలంటే రూ. 20 లక్షలు తమకు అందజేయాలని బోడో తీవ్రవాదులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. దాంతో బోడో తీవ్రవాదుల చెరలో ఉన్న తమ వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని రఘు, ప్రతీశ్ చంద్ర కుటుంబసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్(ఏపీ) ప్రభుత్వ ప్రతినిధిగా మాజీ ఎంపీ, టీడీపీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహనరావును నియమించాలని ఆపార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. కంభంపాటిని కేబినెట్ మంత్రి హోదాలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఢిల్లీలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు అధికారులతో కూడా కంభంపాటికి సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమించడం లాభిస్తుందని బాబు యోచిస్తున్నట్టు తెలిసింది. -
'విభజన పేరుతో కాంగ్రెస్ నాటకాలు'
హైదరాబాద్ : ప్రజలలో ఆదరణ లేకనే విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్రావు మండిపడ్డారు. ఆయన మంగళవారం ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తానని చంద్రబాబునాయుడు చెప్పారని కంభంపాటి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు మాటల్లో స్పష్టత లేదని అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. -
'విభజన పేరుతో కాంగ్రెస్ నాటకాలు'
హైదరాబాద్ : ప్రజలలో ఆదరణ లేకనే విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్రావు మండిపడ్డారు. ఆయన మంగళవారం ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తానని చంద్రబాబునాయుడు చెప్పారని కంభంపాటి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు మాటల్లో స్పష్టత లేదని అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.