హైదరాబాద్ : ప్రజలలో ఆదరణ లేకనే విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్రావు మండిపడ్డారు. ఆయన మంగళవారం ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తానని చంద్రబాబునాయుడు చెప్పారని కంభంపాటి అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు మాటల్లో స్పష్టత లేదని అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
'విభజన పేరుతో కాంగ్రెస్ నాటకాలు'
Published Tue, Sep 3 2013 9:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement