
కంభంపాటికి కేకు తినిపించిన చంద్రబాబు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహనరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని రామ్మోహనరావుకు కేకు తినిపించారు. ఈ సందర్భంగా కంభంపాటికి 59వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఇవాళ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన విషయం తెలిసిందే.