పాలకొల్లులో పండగ | allu arjun sankranti celebrated in palakollu | Sakshi
Sakshi News home page

పాలకొల్లులో పండగ

Published Fri, Jan 4 2019 4:37 AM | Last Updated on Fri, Jan 4 2019 4:37 AM

allu arjun sankranti celebrated in palakollu - Sakshi

అల్లు అర్జున్‌

‘మావయ్యది మొగల్తూరు.. మా నాన్నది పాలకొల్లు...’ అంటూ ‘గంగోత్రి’ సినిమాలో సందడి చేశారు అల్లు అర్జున్‌. ఆయనది పాలకొల్లు అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ స్టైలిష్‌ స్టార్‌ ఈసారి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగను పాలకొల్లులో జరుపుకోనున్నారు. తెలుగువారికి పెద్ద పండగ సంక్రాంతి. మామూలుగా సంక్రాంతి అంటే సిటీలో కాకుండా పల్లెల్లో బాగుంటుంది. పండగ సందడంతా అక్కడే ఉంటుంది. అందుకే బన్నీ పాలకొల్లు వెళ్లాలని అనుకుని ఉంటారు. ఈ మధ్య హైదరాబాద్‌లో క్రిస్మస్‌ సంబరాలు చేసుకుని, న్యూ ఇయర్‌ సందర్భంగా ఫ్యామిలీతో లెబనాన్‌ వెళ్లారు బన్నీ. ఇప్పుడు సంక్రాంతికి పాలకొల్లుని సెలెక్ట్‌ చేసుకున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్‌ స్టార్ట్‌ కాకముందు ఇలా ఫ్యామిలీతో పండగలు, ముఖ్యమైన వేడుకలను మిస్‌ కాకుండా చేసుకుని, ఆ తర్వాత సినిమాతో బిజీ అయిపోతారు బన్నీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement