55 వార్డు స్థానాలు ఏకగ్రీవం | 55 wards place won by unanimous | Sakshi
Sakshi News home page

55 వార్డు స్థానాలు ఏకగ్రీవం

Published Sat, Jan 11 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

55 wards place won by unanimous

 రెండు సర్పంచ్ స్థానాలకు బరిలో నలుగురు అభ్యర్థులు
 ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
 18న మలివిడత పంచాయతీ ఎన్నికలు
 
 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: మలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల  ఉపసంహరణకు శుక్రవారంతో గడువు ముగిసింది.  2013 సంవత్సరం జూలైలో ఎన్నికలు జరగని నాలుగు సర్పంచ్, 75 వార్డు స్థానాలకు ఈ నెల 3 నుంచి ఆరో తేదీ వరకు మొత్తం 107 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి బరిలో కేవలం 18 మంది అభ్యర్థు లు మాత్రమే నిలిచినట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ వి.సత్యసాయిశ్రీనివాస్ తెలిపా రు. సర్పంచ్ స్థానాలకు నలుగురు, వార్డు స్థానాలకు 14 మంది పోటీపడుతున్నారు. బరిలో  ఉన్న అభ్యర్థులకు ఈ నెల 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజున మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు నిర్వహించి, విజేతలను ప్రకటిస్తారు. ఉపసర్పంచ్ ఎన్నిక అదే రోజున పూర్తి చేయనున్నారు.
 
 ఆ రెండు పంచాయతీలకు ఎన్నికలు లేనట్లే.. !
 జిల్లాలో నాలుగు పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా వాటిలో రెండు పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కొత్తవలస మండలం వియ్యంపేట, సీతానగ రం మండలం జోగింపేట పంచాయతీలకు పాత పరిస్థితే వచ్చింది. ఈ రెండు పంచాయతీ లకు నామినేషన్లు దాఖలుకాకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.  వేపా డ మండలం గుడివాడ సర్పంచ్ స్థానానికి  తొమ్మిది నామినేషన్లు దాఖలు కాగా అందులో ఏడు  నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరిం చుకున్నారు. దీంతో పోటీలో ఇద్దరే మిగిలారు.  సాలూరు మండలం పురోహితునివలస సర్పం చ్ స్థానానికి ఐదు నామినేషన్లు దాఖలు కాగా అందులో మూడు నామినేషన్లను ఉపసంహరిం చుకున్నారు. ఇక్కడ కూడా ఇద్దరే మిగిలారు. దీంతో రెండు సర్పంచ్ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీపడనున్నారు.
 
 ఏడు వార్డుల్లో పోటీ
 జిల్లా వ్యాప్తంగా మొత్తం 75 వా ర్డు స్థానాలకు మలివిడతలో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీచేయగా అందులో 13 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 55 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వాటిని ఏకగ్రీవంగా ప్రకటించారు. మిగిలిన ఏడు వార్డులకు మొత్తం 14 మంది పోటీ పడుతున్నారు. ఇందులో వేపాడ మండలం గుడివాడలో మొదటి వార్డుకు, మెరకముడిదాం మండలం కొండలావేరు నాలుగో వార్డుకు, బొండపల్లి మండలం బిల్లలవలసలో నాలుగో వార్డుకు, ఎల్.కోట మండటం చందులూరులో ఐదో వార్డుకు, జియ్యమ్మవలస మండలం అర్నాడలో ఏడో వార్డుకు, తెర్లాం మండలం డి.గదబవలసలో మొదటి వార్డుకు, బాడంగి మండలం బాడంగిలో ఏడో వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement