పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. ప్రత్యేకాధికారుల పాలన కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతే... జిల్లాలో హడావుడి మొదలైంది. తమకు నచ్చిన అధికారులను నియమించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. అక్రమాలు సజావుగా సాగించుకునేందుకు అనువైన అధికారుల కోసం వెతుకులాడుతున్నారు. ఉన్నతాధికారులు ప్రతిపాదనలు కాదని తమకు అనుకూలమైన అధికారుల పేర్లతో కూడిన జాబితాలు అందజేస్తున్నారు. నియామకాలను పూర్తిచేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రజాధనం దోచుకున్న వీరి తాపత్ర యం చూస్తే మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ఆగడాలకు చెక్‌పడేలా లేవన్న వాదన వినిపిస్తోంది.
సాక్షి ప్రతినిధి విజయనగరం: పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేని టీడీపీ 2013లో ఏర్పడి తాజాగా గడువు ముగి సిన జిల్లాలోని 920 పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించింది. ఇన్నాళ్లూ తమ చెప్పుచేతల్లో ఉన్న పంచాయతీలు చేజారిపోకూడదని టీడీపీ నేతలు భావిస్తున్నా రు. దీంతో తమకు అనుకూలంగా ఉండేవారినే ప్రత్యేకాధికారులుగా నియమించాలనిచూస్తున్నా రు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించి అనుకూలుర జాబితా తయారు చేశారు. ప్రతిపక్షానికి ఎక్కువమంది సర్పంచ్‌లు ఉండటంతో వారి స్థానంలో ఇప్పుడు టీడీపీ అనుకూల అధికారులను ఉంచాలని రూపొందించిన జాబితాలు శనివారం విడుదలయ్యాయి.
తహసీల్దార్, డీప్యూటీ తహసీల్దార్, ఎంపీడీఓ, అగ్రికల్చర్ ఏఓ, ఐ సీడీఎస్ సూపర్‌వైజర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ, ఇరిగేషన్ జేఈ, ఎండీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులు 351 మందిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఎన్నికలముందు ఎక్కువగా విడుదలయ్యే నిధులతోపాటు, గ్రామాల్లో ఎన్నికల లబ్ధికోసం టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మ రోవైపు ఇప్పుడీ లోకల్ పాలి‘ట్రిక్స్’టీడీపీలో వర్గపోరును బహిర్గతం చేస్తోంది.
ఆధిపత్య పోరు...: గ్రామాల్లో తమ వారినే నియమించాలని కొందరు టీడీపీ నేతలు అధికారుల పేర్లను సిఫారసు చేశారు. వాటిని మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద ఉంచుతున్నా రు. అయితే, తమ వర్గం వారి జాబితాలకే ప్రజా ప్రతినిధులు మొగ్గుచూపిస్తుండటంతో మరోవర్గం అసంతృప్తికి గురవుతోంది. బొబ్బిలి మండలంలో పాతటీడీపీ వర్గం (తెంటు వర్గం) తరఫున జన్మభూమి కమిటీ అధ్యక్షుడు అల్లాడ భాస్కరరావు, కొత్త టీడీపీ(రాజుల టీడీపీ)తరఫున తమ్మిరె డ్డి దామోదరరావులు 15 మంది అధికారులతో జాబితాను జిల్లాకు ఈనెల 2న పంపారు. అయితే, నిరంతరం మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుతో తిరిగే మంత్రి కోటరీ సభ్యులు 15 మంది అధికారుల జాబితాను మారుస్తూ, వీరు పంపిన పేర్లను తొలగించి, మరి కొందరిని చేర్చి కొత్త జాబితాను మార్చి ఈ నెల 3న నెట్‌లో ఎంపీడీఓ కార్యాలయానికి పంపారు. బొబ్బిలిలో ఉండే లోకల్ నాయకులు అల్లాడ భాస్కరరావు, తమ్మిరెడ్డి దామోదరరావు ఈజాబితాను అంగీకరించే ది లేదని, తెంటు లకు‡్ష్మనాయుడుకు, బేబీ నాయనకు తెలిపి తిరిగి తాము పంపిన జాబితానే ఆమోదించాలని జిల్లాకేంద్రానికి తిరిగి పంపారు. మంత్రి కోటరీ కూడా తమ జాబితానే ఆమోదించాలని పట్టుపడుతున్నారు. దీంతో ఇక్కడే కాకుండా బొబ్బిలి నియోజకవర్గం మొత్తం ప్రత్యేకాధికారుల నియామకంలో స్పష్టత రాలేదు.
అదే పనిలో అందరూ...
మంత్రిస్థాయిలోనే కాదు ఇటు ఎమ్మెల్యేల స్థాయిలోనూ ప్రత్యేకాధికారుల పేర్ల జాబి తా తయారీపై తీవ్రంగా కసరత్తు జరిగింది. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళిని రెండు రోజుల ముందే టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మండల కేంద్రాల్లో, ముఖ్యంగా మేజర్ పంచాయతీల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్నవారెవరు, ఏ అధికారిని నియమిస్తే తమకు మేలు జరుగుతుందనేదానిపై వారితో చర్చించారు. పనిలోపనిగా తనకు వ్యతిరేకంగా ఉండే స్వపార్టీ వారికి చెక్ పెట్టాలనుకున్నారు. చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ మీసాల సరోజిని భర్త, జెడ్పీటీసీ వరహాలనాయుడికి ఎమ్మెల్యేకు మధ్య నిత్య వివాదం నడుస్తోంది.
ఇప్పుడు సరోజిని పదవీకాలం ముగియడంతో ఆ పంచాయతీకి తన మాట వినే అధికారిని పంపించాలని మృణాళిని భావించారు. అనుకున్నట్లుగానే అక్కడి తహసీల్దార్‌కు మండలంలోని చిన్న పంచాయతీని అప్పగించి తనకు అనుకూలంగా ఉంటాడనే కారణంతో అగ్రికల్చర్ ఏడీని ప్రత్యేకాధికారిగా సిఫార్సు చేసి నియమించుకున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కో అధికారిని రెండు, మూడు పంచాయతీలకు ప్రత్యేకాధికారిగా నియమించారు. ము ఖ్యంగా మేజర్ పంచాయతీలు, తమకు ఇన్నాళ్లూ పట్టులేని పంచాయతీలను తమ అనుకూల అధికారులకు ఒకటి, రెండు చొప్పున అప్పగించేశారు.
ప్రాధాన్యంలేని పంచాయతీలను తటస్తులైన అధికారులకు అప్పగించారు. ఇక రేపటి నుంచి పంచాయతీల్లో ఏ పని జరగాలన్నా ప్రజలు, ప్రతిపక్షం గోడు వినేనాథుడు కనిపించకపోవచ్చు. అధికారపార్టీ కనుసన్నల్లోనే పాలన సాగుతోంది. ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పక్షపాతంగా చేస్తున్న టీడీపీ ఆగడాలకు ఇప్పుడు అ«ధికారి అండ దొరికినట్టయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment