డిగ్రీ పేపర్‌ లీక్‌లో ఏడుగురు అరెస్ట్‌ | 7 arrested in question paper leak case | Sakshi
Sakshi News home page

డిగ్రీ పేపర్‌ లీక్‌లో ఏడుగురు అరెస్ట్‌

Published Mon, Apr 10 2017 6:41 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

డిగ్రీ పేపర్ లీక్ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేసినట్లు లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ నవీన్‌ గులాటీ తెలిపారు.

విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో డిగ్రీ పేపర్ లీక్ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేసినట్లు లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ నవీన్‌ గులాటీ తెలిపారు. ఈ లీకేజీకి చోడవరంలోని విద్యార్ధి డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్‌ సురేష్‌  కారణం అని ఆయన చెప్పారు. ఆయన నుంచి పేపరు తీసుకున్న నలుగురు విద్యార్థులు వాట్సాప్‌లో దానిని పంపి లీక్‌ చేశారని చెప్పారు. దీనిపై విచారణ జరిపి మొత్తం ఏడుగురిని అరెస్టు చేశామన్నారు.

మార్చి 16ఆంధ్రా యూనివర్శిటీ, అనుబంధ కళాశాలల్లో జరుగుతున్న బిఎస్సీ పరీక్షల్లో గురువారం మ్యాథ్స్ పేపర్-3 లీక్ అయింది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ పరీక్ష జరగాల్సి ఉండగా, 12.30 గంటలకే పేపర్ వాట్స్ప్‌లో వెలుగుచూసింది. పేపర్ లీక్ అయిందన్న విషయాన్ని ఆ విభాగాధిపతి ధ్రువీకరించడంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు వర్శిటీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు ప్రకటించిన విషయం తెలిసిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement