విషాహారం తిని 860 గొర్రెలు మృత్యువాత | 860 sheeps died due to pesticides | Sakshi
Sakshi News home page

విషాహారం తిని 860 గొర్రెలు మృత్యువాత

Published Fri, Jun 5 2015 7:35 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

860 sheeps died due to pesticides

కోయిలకుంట్ల (కర్నూలు) : అనంతపురం జిల్లా సింగనమల మండలం నుంచి మేత కోసం వలస వచ్చిన గొర్రెల కాపరులకు తీవ్ర నష్టం సంభవించింది. విషాహారం తిని వందల సంఖ్యలో మూగజీవాలు చనిపోయాయి. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలంలోని పొలాల్లో తిరుగుతున్న సుమారు 5వేల గొర్రెల్లో కొన్ని పురుగుల మందు చల్లిన జొన్న కర్రలను తిన్నాయి. విష ప్రభావంతో దాదాపు 860 గొర్రెలు చనిపోయాయి. దీంతో అప్రమత్తమైన కాపరులు మిగతా వాటిని ఆ ప్రాంతం నుంచి మరోచోటికి తోలుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement