గిద్దలూరు (ప్రకాశం జిల్లా) : గిద్దలూరు మండలం ఉప్పలపాడులో విషాదం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న జడల కల్యాణి(14) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గది తలుపులు మూసివేసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలపాలై ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.