![Man From Giddalur Commits Suicide In Chittoor District - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/15/train.jpg.webp?itok=bLMcsf7Z)
సాక్షి, గిద్దలూరు: స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న బిజ్జం నాగేశ్వరరెడ్డి (47) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగింది.
అందిన సమాచారం ప్రకారం.. పట్టణానికి చెందిన నాగేశ్వరరెడ్డి కొన్నేళ్లుగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఔట్ సోర్సింగ్ విధానంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిది నెలలుగా వేతనాలు అందక పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు అప్పులు చేశాడు. వేతనాలు రాకపోవడంతో పాటు కుటుంబం కోసం చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనతో రైలెక్కి కర్ణాటక వెళ్లినట్లు బంధువులు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖాధికారులు, ఏజెన్సీ నిర్వాహకులకు తమ సమస్యను వివరించినా వారు స్పందించకపోవడంతో చేసేది లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment