పలమనేరులో రెండు తోకల బల్లి
మామూలుగా బల్లికి ఓ తోక ఉండడం తెలిసిందే. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో సోమవారం రెండు తోకల బల్లి కనిపించింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల ఓ పండ్ల దుకాణంలో ఈ బల్లి దుకాణ యజమానికి కనిపించింది. ఇది విచిత్రంగా ఉండడంతో దీన్ని చూసేందుకు బస్టాండ్‌లోని జనం ఆసక్తిగా చూశారు. జన్యుపరమైన లోపాలతోనే ఇటువంటివి అరుదుగా పుడుతుంటాయని పలమనేరు పశువైద్యాధికారి డాక్టర్ సుజాత తెలిపారు.
- పలమనేరు