
ఆవుతాడే ప్రాణం తీసింది
ఆద మరిచి పట్టాలు దాటుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి పడి మృతిచెందిన సంఘటన జిల్లాలోని రైల్వే స్టేషన్ సమీపంలోని నివానది వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
చిత్తూరు: ఆద మరిచి పట్టాలు దాటుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుంచి పడి మృతిచెందిన సంఘటన జిల్లాలోని రైల్వే స్టేషన్ సమీపంలోని నివానది వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆవుతో పాటు రైలు పట్టాలు దాటుతున్న వ్యక్తి.. జాగ్రత్త కోసం ఆవు తాడును చేతికి చుట్టుకున్నాడు. అదే సమయంలో అటు వైపు నుంచి రైలు కూత వినబడటంతో.. ఆవు ఒక్కసారిగా అతన్ని బలంగా పక్కకు లాక్కెళ్లింది. రైలు కూతకు బెదిరిన ఆవు బ్రిడ్జిపై నుంచి కిందకు దూకింది.
దీంతో తాడు చేతికి కట్టుకొని ఉన్న ఆ వ్యక్తి కూడా కింద పడ్డాడు. అంత ఎత్తు మీదనుంచి పడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి జేబులో కాణిపాకం నుంచి వచ్చిన రైలు టికెట్ మాత్రమే లభించింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.