
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భామిని మండలం లోహరజోల గ్రామంలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. కుమారస్వామి అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి బైక్‌పై పర్లాకిమిడి వెళ్తుండగా, బైక్‌ను అడ్డగించిన నిందితుడు.. భార్య, పిల్లులు చూస్తుండగానే కుమారస్వామిని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. పరారైన నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: వేధింపులకు తాళలేక టిక్‌టాక్ స్టార్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment