కృష్ణా జిల్లా పామిడిముక్కల మండలంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది.
పామిడిముక్కల(కృష్ణా): కృష్ణా జిల్లా పామిడిముక్కల మండలంలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మండలంలోని అయినపూర్‌లో చోటుచేసుకుంది. అయినపూరుకు చెందిన బీలి వీరమ్మ(50) వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. అయితే పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పిడుగుపడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.