ఆధార్ ప్రచార వాహనం ప్రారంభం
Published Fri, Sep 20 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం గ్యాస్‌పై అందిస్తున్న రాయితీ, ప్రయోజనాలు, ఆధార్ ప్రాధాన్యంపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని కలెక్టర్ అహ్మద్ బాబు గురువారం స్థానిక సాంకేతిక అభివృద్ధి శిక్షణ కేంద్రం(టీటీడీసీ) ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు రాయితీ పొందడానికి బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు జత చేసి దగ్గరలోని బ్యాంకులో అందజేయాలని తెలిపారు. బ్యాంకు ఖాతా లేని వారు వెంటనే పొందాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ వాహనం ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమన్వయ కమిటీని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీహెచ్ ఎజీఎం జీవీ.ప్రసాద్, ఎల్‌డీఎం శర్మ, డీజీబీఆర్‌ఎం శ్రీనివాసరావు, ఆంధ్రాబ్యాంకు కో-ఆర్డినేటర్ యుగేంధర్, ఇతర బ్యాంకుల సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement