ఇకపై ఆధార్‌తో ఇంటి పన్ను చెల్లింపులు
మున్సిపల్ ఆర్డీ ఆశాజ్యోతి
బొబ్బిలి: ఇకపై మున్సిపాలిటీలలో పన్నులను ఆధార్‌తో అనుసంధానం చేసి చె ల్లించాలని మున్సిపల్ ఆర్డీ ఆశాజ్యోతి తెలిపారు. ఆమె స్థానిక మున్సిపల్ కా ర్యాలయం సిబ్బందితో శుక్రవారం వి విధ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 15లోగా ఆధార్ అనుసంధానం పూర్తిచేస్తామని, ఇళ్ల యజమానులంతా సహకరించాలని, బిల్ కలెక్టర్లు ఇంటింటికీ వస్తారని తెలిపారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా మున్సిపాలిటీలో రాబోయే 13వ ఆర్థిక సంఘం నిధులను వినియోగిస్తామని తెలిపారు. అక్రమ లే అవుట్లపై తమ సిబ్బంది నిత్యం చర్యలు చేపడుతున్నారని, ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న జీఓ 398ను తాము పాటిస్తున్నామన్నారు.
నిధులు లేని మున్సిపాలిటీలకు 13వ ఆ ర్థిక సంఘం నిధుల ద్వారా వచ్చే సొ మ్మును చెత్తసేకరణకు వినియోగిస్తామన్నారు. తమ పరిధిలో రావాల్సిన పన్ను *37.3కోట్లు కాగా *10.91 కోట్లు వసూలైందన్నారు. జిల్లాలో మొత్తం 21.97 కోట్ల రూపాయలు పన్ను ఉండగా వీటి లో 6.46 కోట్ల రూపాయలు వసూలైందన్నారు. విజయనగరం మున్సిపాలిటీలో 13.73కోట్లకు 4.78కోట్ల రూపాయలు, బొబ్బిలిలో 2.84కోట్లకు 57లక్షలు, సాలూరులో 1.93కోట్లకు 47లక్షలు, పార్వతీపురంలో 3.14కోట్లకు 59లక్షలు, నెల్లిమర్లలో 31.90లక్షలకు గాను 3.25లక్షలు రూపాయలు వసూలయ్యాయని తెలిపారు.