బడి పిల్లలకూ ఆధార్ లింకు | Aadhaar link school children in Eluru | Sakshi
Sakshi News home page

బడి పిల్లలకూ ఆధార్ లింకు

Published Sat, Nov 1 2014 12:54 AM | Last Updated on Fri, May 25 2018 6:21 PM

బడి పిల్లలకూ ఆధార్ లింకు - Sakshi

బడి పిల్లలకూ ఆధార్ లింకు

 ఏలూరు సిటీ : బడి పిల్లలకూ ఆధార్ లింకును తప్పనిసరి చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారులు సర్కారు పాఠశాలల్లో చేరాలంటే విధిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ప్రస్తుతం బడుల్లో చదువుతున్న విద్యార్థులంతా ఆధార్ నంబర్ నమోదు చేరుుంచుకోవాల్సిందే. సర్కారు ఆదేశాల నేపథ్యంలో విద్యార్థులంతా తమ ప్రవేశ సంఖ్య (అడ్మిషన్ నంబర్)తో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేరుుంచుకోవాలంటూ ఉపాధ్యాయులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆధార్ కార్డులు పొందని బడుగు కుటుంబాల్లోని పిల్లలు బిక్కమొహం వేస్తున్నారు. జిల్లాలో 20 శాతం విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవు. వీరిలో సగం మంది తల్లిదండ్రులకు ఆధార్ కార్డున్నా వారి పిల్లలకు లేదు. రానున్న రోజుల్లో ఆధార్ కార్డు ఉంటేనే స్కూళ్లలో ప్రవేశం అన్నది నిబంధన కానుందని, అది లేనిదే సర్కారు నుంచి వచ్చే రాయితీలు విద్యార్థులకు అందవని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులకూ ఆధార్ నంబర్ జోడింపు విధానం అమల్లో ఉందని చెబుతున్నారు.
 
 నెల రోజులుగా ఒత్తిడి
 విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు ఆధా ర్ నంబర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థి తన ఆధార్ కార్డు ఫొటోస్టాట్ కాపీని పాఠశాలలో అందించాలని నెల్లాళ్లుగా ఉపాధ్యాయులు అడుగుతున్నారు. వాటిని ఇవ్వని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆధార్ కార్డు లేని విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తటపటాయిస్తున్నారు. కొత్తగా ఏ ప్రభుత్వ పాఠశాలలో చేరాలన్నా ఆధార్ ఉండాల్సిందేనని అధికారులు కచ్చితంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు లేని విద్యార్థులు పాఠశాలలకు దూరమ య్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతున్నారుు.
 
 అవినీతికి చెక్ పెట్టేందుకేనట
 ప్రభుత్వ పాఠశాలల్లో వాస్తవంగా విద్యార్థులు ఎంతమంది ఉన్నారు.. ఎంతమందికి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయనే అంశాలపై ఆరా తీసేందుకు ఆధార్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంతోపాటు, యూనిఫామ్, పాఠ్య పుస్తకాల పంపిణీ వంటివి సక్రమంగా సాగుతున్న దాఖ లాలు కనిపించడం లేదు. ఏ స్కూల్‌లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారనేది విద్యా శాఖ అధికారులకే తెలియని దుస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయ పోస్టులు నష్టపోతామనే భయంతో ఉపాధ్యాయుల విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నట్టు రికార్డుల్లో చూపిస్తున్నారని, అధికారులు తనిఖీలకు వెళుతున్నప్పుడు ఆ రోజు విద్యార్థులు గైర్హాజరైనట్టు సాకులు చెబుతున్నారని తెలుస్తోంది. ఒకే విద్యార్థి అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉన్నట్టు చూపి స్తూ కాలం వెళ్లదీస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. దీనివల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే ఉద్దేశంతో.. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు విద్యార్థులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నారుు. జిల్లాలో 2,319 ప్రాథమిక, 236 ప్రాథమికోన్నత, 465 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
 
 వీటిలో సుమారు 3.70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తంగా 15 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు లేకపోరుునా ఉపాధ్యాయ పోస్టుల్ని కాపాడుకునేందుకు విద్యార్థుల సం ఖ్యను ఎక్కువగా చూపిస్తున్నారు. ఉన్నత పాఠశాలల పరిస్థితి బాగానే ఉన్నా ప్రాథమిక పాఠశాలల్లో మాత్రం దీనంగా ఉంది. రాజీవ్ విద్యామిషన్ చేపట్టిన సర్వేలో జిల్లాలోని 320కి పైగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10 మందికి లోపే విద్యార్థులు ఉన్నట్టు గుర్తించారు. అలాంటిచోట ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పూర్తిస్థారుులో విద్యార్థులు లేకపోరుునా అదనపు తరగతి గదులు, ఇతర సౌకర్యాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య భారీగా ఉన్న పాఠశాలలకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యార్థులకు ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నారుు.
 
 త్వరలో బయో మెట్రిక్
 సంక్షేమ వసతి గృహాలతోపాటు పాఠశాల ల్లోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొం దించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని 60 శాతం విద్యార్థుల ఆధార్ వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈనెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో విద్యార్థుల వివరాలన్నీ ఆధార్‌తో అనుసంధానం చేస్తారు. అనంతరం పాఠశాలల్లో బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టి విద్యార్థుల హాజరును ఆ విధానంలో సేకరిస్తారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement