అమ్మకానికి అంగన్‌వాడీ ఉద్యోగాలు
అంగట్లో సరుకుల్లా అంగవాడీ పోస్టులను అమ్మేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కో పోస్టుకు రూ.2లక్షల వరకు దండుకున్నారు. తీరా ఇంటర్వ్యూల సమయంలో తమ పైరవీలకు అడ్డుకట్ట పడేసరికి కంగుతిన్నారు. తమ మాటే చెల్లుబాటు కావాలని సంబంధిత అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. చివరకు ఈ పంచాయితీ సీఎం వద్దకు చేరడంతో ఇంటర్వ్యూలను నిలిపివేశారని విశ్వసనీయ సమాచారం.
చిత్తూరు(గిరింపేట): జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు గత నెల 17న నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాలోని 20 అంగన్‌వాడీ ప్రాజెక్టుల పరిధిలో 105 కార్యక ర్తలు, 552 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించడానికి జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టులకు గాను జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా ఐసీడీఎస్ పీడీ కన్వీనర్‌గా, ప్రాజెక్టు సీపీడీవో, జిల్లా డీఎంహెచ్‌వో, ఆర్డీవో కమిటీ మెంబర్లుగా ఉంటారు.
పోస్టుల అమ్మకం
అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు జిల్లాలోని కొన్ని ప్రాజెక్టుల పరిధిలో పోస్టుకో రేటు చొప్పున అమ్మేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు రూ.3 లక్షలు, ఆయా పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
అగ్గిమీద గుగ్గిలమవుతున్న ఎమ్మెల్యేలు
గతంలో ఇంటర్వ్యూలు నిర్విహ ంచే కమిటీల్లో ఎమ్మెల్యేలకు సభ్యులుగా స్థానం ఉండేది. వారి మాటే చెల్లుబాటయ్యేది. కానీ ప్రస్తుతం వారి స్థానంలో ఆర్డీవోకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఎమ్మెల్యేలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రధానంగా మంత్రి పదవి ఆశిస్తున్న జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇటీవలే ఓ ఉన్నతాధికారిపై ఫైర్ అయినట్లు సమాచారం. తాను చెప్పిన వారికి పోస్టులెందుకు ఇవ్వరంటూ మండిపడినట్లు తెలిసింది. ఆయనతోపాటు అసంతృప్తి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడంతో ఇంటర్వ్యూలను వాయిదా వేశార ని అంగవాడీ కార్యకర్తల అసోసియేషన్ నాయకులు పేర్కొంటున్నారు.
వాయిదా వేశాం : జిల్లా ఐసీడీఎస్ పీడీ లక్ష్మి
ఈ నెల 1వ తేదీ వర కు దర ఖాస్తులు స్వీకరించారు. అయితే, ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఇంటర్వ్యూలను వాయిదా వేశాం. ఇంటర్వ్యూలకు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో వ చ్చిన దర ఖాస్తులను పరీశీలించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఇంటర్వ్యూల తేదీలను క లెక్టర్ ప్రక టిస్తే, ఇంటర్వ్యూలను నిర్వహిస్తాం.