అభయ కేసులో బయటపడ్డ మరిన్ని నిజాలు | Abhaya case accused reveal shocking facts | Sakshi
Sakshi News home page

అభయ కేసులో బయటపడ్డ మరిన్ని నిజాలు

Published Thu, Nov 7 2013 6:54 PM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

అభయ కేసులో బయటపడ్డ మరిన్ని నిజాలు - Sakshi

అభయ కేసులో బయటపడ్డ మరిన్ని నిజాలు

హైదరాబాద్: రాష్ట్ర వాప్తంగా సంచలనం సృష్టించిన అభయ కేసులో మరిన్ని దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. అభయపై అత్యాచారానికి ముందే మరో ఇద్దరు యువతులపై అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో నిందితుడు సతీష్‌ అంగీకరించాడు. మరో నిందితుడు వెంకటేష్‌తో కలిసి అత్యాచారాలు చేశానని దర్యాప్తులో అతడు వెల్లడించాడు.

బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ దారుణాలు వెలుగుచూడలేదు. దీన్ని అలుసుగా తీసుకుని అభయపై అత్యాచారానికి తెగబడ్డారు. గత నెల 18న అభయపై డ్రైవర్లు సతీష్, వెంకటేష్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మాదాపూర్ నుంచి కారులో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఈ దారుణాకి ఒడిగట్టారు. పోలీసులు వీరిని అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement