ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్ \: అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌కు ఆధార్ అనుసంధానం చేయాలనే నిబంధలను వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మొదట నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక మయూరి సెంటర్ నుంచి బయల్దేరిన ప్రదర్శన బస్టాండ్ సెంటర్, జెడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం ఏబీవీపీ నాయకులు జేసీ సురేంద్ర మోహన్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడానికే ప్రభుత్వం అనేక నిబంధనలు సృష్టిస్తోందని విమర్శించారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంటును ఆధార్‌తో లింక్ పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమంత్, రాము, నవీన్, నాయకులు యువరాజ్, నాగరాజు, బాబు, గణపతి, మనోహర్, నరేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ధర్నా
Published Sat, Jan 4 2014 5:49 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement