తిరుపతి: లంచం తీసుకుంటూ ఓ అవినీతి ఉద్యోగి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన తిరుపతి రూరల్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాలు... తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. భూముల విషయమై జయచంద్రారెడ్డి అనే రైతు నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటూ అవినీతికి పాల్పడ్డ పాడిపేట వీఆర్వో రవికుమార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. అధికారులు వీఆర్వోని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.