నేడు అవినీతి వ్యతిరేక దినోత్సవం | Today, against corruption Day | Sakshi
Sakshi News home page

నేడు అవినీతి వ్యతిరేక దినోత్సవం

Published Tue, Dec 9 2014 1:41 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM

Today, against corruption Day

 పేరుకు ఇందరు జనం.... నరనరానా పిరికితనం...అంటూ ఓ సినీ కవి జనాల అసమర్థతను పాట రూపంలో వివరించారు. అవినీతి అంతం విషయంలో ఈ అక్షరాలు నూటిని నూరుపాళ్లు సత్యాన్నే సూచిస్తున్నాయి. అప్పుడే పుట్టిన పిల్లాడి జనన ధ్రువీకరణ పత్రం నుంచి, పండు ముదుసలి పింఛన్ వరకు చేయి తడపనిదే ఏ పనీ కాదని చాలా మంది నిశ్చితాభిప్రాయం. రోజురోజుకూ పెరుగుతున్న అవినీతి, బయటపడుతున్న స్కామ్‌లు, దొరికిపోతున్న అధికారులు అంతా కలిసి ఎప్పటికప్పుడు ఈ అభిప్రాయాలను బలపరుస్తూనే ఉన్నారు. అయితే అభిప్రాయాలు ఏర్పరచుకుని సమాజాన్ని తిట్టే బదులు చిన్న ఫోన్ కాల్ చేయొచ్చు కదా అని అధికారులు అంటున్నారు. ‘కాల్ చేసేంత ధైర్యం మీకుంటే... లంచగొండి ఆట కట్టించే దమ్ము మాకు ఉంది’ అని చెబుతున్నారు. నేడు అవినీతి  వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా...
 
 విజయనగరం క్రైం/లీగల్ : జిల్లాలో అవినీతి పరులు రెచ్చిపోతున్నారు. అవినీతి నిరోధక శాఖలు ఎన్నిసార్లు వల వేసి పట్టుకుంటున్నా... ఇంకా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక రూపంలో అభాగ్యుల రక్తాన్ని కొందరు అధికారులు తెగ జుర్రుతున్నారు. దాదాపుగా అన్ని శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతున్నా కొన్ని శాఖల్లో ఈ జాఢ్యం ఎక్కువగా ఉంది. ప్రజల్లో చైతన్యం వస్తేనే వీరి ఆటలు కట్టించగలమని అధికారులు చెబుతున్నారు. లంచం అడిగిన వారిపై తమకు ఫిర్యాదు చేయాలని, లేదంటే చిన్న ఫోన్ చేసినా సరిపోతుందని సూచిస్తున్నారు. బాధితులు ఏం చేయాలో ఇలా సూచించారు.
 
 ఎవరిని సంప్రదించాలి...
 ఎవరైనా పనులు నిమిత్తం వెళ్లినపుడు అధికారులు లంచం అడిగితే వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాలి. కుసుమ గజపతినగర్‌లోని ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించాలి. ఏ పనికి అధికారికి దరఖాస్తు చేశారో ఆ పనికి ఎంత మొత్తంలో లంచం  అడిగానేది ఏసీబీ అధికారులకు తెలియజేయాలి. ఇక్కడ అధికారులకే కాకుండా రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాలనుకునేవారికి ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా లంచం అడిగితే  ఈ అధికారులకు ఫోనుచేసి చెప్పొచ్చు. డీఎస్పీ ఫోన్ నంబర్ 9440446174, సీఐలు 9440 446175, 9440446176, కార్యాలయ ఫోన్ నంబర్ 08922-276404ను ఆశ్రయించాలి
 
 ఇందులోనే ఎక్కువ లంచాలు...
 లంచాలు ఇవ్వనిదే ఏ శాఖలోనే పనులు జరగడం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు. అవినీతి అనేది ఎక్కువగా రెవెన్యూ, విద్యుత్, పోలీసు, ఇరిగేషన్, ఆడిట్, మున్సిపాలిటీ, ఆర్టీఓ, వైద్యారోగ్యశాఖల్లో ఎక్కువగా, మిగతా శాఖ లో తక్కువగా జరుగుతుందనేది ఏసీబీ కార్యాలయంలోనే నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. గతంలో ఆకస్మిక దా డులు చేసేవారు, ప్రస్తుతం ఫిర్యాదుల మేరకు చేస్తున్నారు. దీంతో అవినీతి పరులు మరింత రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 జిల్లాకో డీఎస్పీ కార్యాలయం..
 గతంలో రెండు జి ల్లాలు విజయనగ రం, శ్రీకాకుళంల కు ఒక ఏసీబీ డీ ఎస్పీ కార్యాలయం ఉండేది. విజయనగరంలో డీఎస్పీ కార్యాలయం ఉంటే శ్రీకాకుళం ఇన్‌స్పెక్ట ర్ కార్యాలయం ఉం డేది. ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రం రెండుగా విడిన తర్వాత జిల్లాకో డీఎ స్పీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. అందులో భాగంగా 2014 జూలై నెల నుంచి విజయనగరం డీఎస్పీ కార్యాలయంతోపాటు, శ్రీకాకుళంలో కూడా ఏసీబీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు.
 దీంతో మరింత మంది అవినీతి పరులపై దృష్టి సారించి పట్టుకోవడానికి వీలుంటుంది
 
  వివరాలు గోప్యం..
 ఏదైనా శాఖలో లంచం, అక్రమాలు జరుగుతున్నాయని సమాచారాన్ని ఏసీబీ అధికారులకు అందిస్తే... వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఏ అధికారైనా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం ఉంటే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలి. అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు అందిస్తే మంచిది.
 
 సమాచారం అందించండి
 జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా అవినీతికి పాల్పడితే సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఫిర్యాదుదారులు స్వయం గా లేక, ఫోన్ ద్వారా సంప్రదించినా తగు చర్యలు తీసుకుంటాం. ఈ ఏడాది అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.
 - సి.హెచ్.లక్ష్మిపతి,
 ఏసీబీ డీఎస్పీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement