అనంతపురం: పొలానికి సరిహద్దు రాయి వేయడానికి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలో మంగళవారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన రామచంద్ర అనే రైతు తన భూమికి సంబంధించిన హద్దు రాళ్లు పాతాల్సి ఉందని మండల సర్వేయర్ జి. లక్ష్మినారాయణను సంప్రదించాడు. సర్వేయర్ అందుకోసం రూ. 20 వేలు అవుతుందని, ముందు పదివేలు ఇస్తే పని మొదలు పెడతానని అనడంతో రైతు రామచంద్ర ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి సర్వేయర్ మంగళవారం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం సర్వేయర్ ను విచారణ చేస్తున్నారు.
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
Published Tue, Aug 4 2015 1:55 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement