
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీసీటీఓ
విశాఖపట్నం: మరో అవినీతి చేప ఏసీబీ చేతికి చిక్కింది. లంచం తీసుకుండగా ఓ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఓ బంగారం వ్యాపారిని రూ. లక్షా 50 వేలు డీసీటీఓ కమలారావు లంచం డిమాండ్ చేశాడు. కైలాసగిరిలోని తన ఇంట్లో సోమవారం వ్యాపారి నుంచి లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నగదు స్వాధీనం చేసుకుని డీసీటీఓను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.