dcto
-
తాటిపర్తిలో రేషన్‌షాపు సీజ్
తాటిపర్తి(పెద్దాపురం) : విజిలెన్స్ అధికారులు సోమవారం తాటిపర్తి, తిరుపతి గ్రామాల్లో దాడులు నిర్వహించారు. తాటిపర్తిలో బీవీ చక్రావతికి చెందిన రేషన్ షాపు నం.44లో విజిలెన్స్ డీసీటీఓ బి.రత్నకుమార్, విజిలెన్స్ తహసీల్దార్ గోపాలరావు, పీసీ స్వామి తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత స్టాకు కంటే 55 క్వింటాళ్లు (110 బస్తాలు) బియ్యం తక్కువగా ఉండడాన్ని గుర్తించారు. నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చేసి, దుకాణాన్ని సీజ్ చేశారు. తిరుపతిలో స్టాకు సక్రమంగా ఉందని అధికారులు తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీసీటీఓ
విశాఖపట్నం: మరో అవినీతి చేప ఏసీబీ చేతికి చిక్కింది. లంచం తీసుకుండగా ఓ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఓ బంగారం వ్యాపారిని రూ. లక్షా 50 వేలు డీసీటీఓ కమలారావు లంచం డిమాండ్ చేశాడు. కైలాసగిరిలోని తన ఇంట్లో సోమవారం వ్యాపారి నుంచి లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నగదు స్వాధీనం చేసుకుని డీసీటీఓను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బకాయిల బండ
వాణిజ్య పన్నుల శాఖలో పన్ను బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఒక్క నందిగామ డివిజన్‌లోనే రూ. 50 కోట్ల పన్నులు వసూలు కావాల్సిఉంది. విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖలో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోతున్నాయి. పన్నుల వసూలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. బకాయిలతో పాటు ప్రతి నెలా జమ పడాల్సిన పన్నులను వసూలుచేసే నాథుడే కనిపించడంలేదు. నెలవారీ మామూళ్లు దండిగా వసూలు చేసుకుంటున్న అధికారులు ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ 1వ డివిజన్ పరిధిలో ఉన్న నందిగామ సర్కిల్లో భవానీపురం, కంచికచర్ల, జగ్గయ్యపేట యూనిట్ల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల నుంచి మూడేళ్లుగా దాదాపు రూ.50 కోట్ల పన్నులు ప్రభుత్వానికి జమకాలేదు. నందిగామ సర్కిల్లో మెత్తం నాలుగు వేల మంది వ్యాట్ డీలర్లు, 2,500 మంది టర్నోవర్ టాక్స్ డీలర్లు ఉన్నారు. వ్యాట్ డీలర్లు ప్రతి నెలా తమ లావాదేవీలకు సంబంధించి రిటర్న్‌లు ఫైల్ చేయాలి. టర్నోవర్ టాక్స్ డీలర్లు మూడు నెలలకోసారి ఫైల్ చేస్తారు. డీసీటీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డీలర్లు సరిగా రిటర్న్‌లు ఫైల్ చేయడం లేదని సమాచారం. నందిగామ సర్కిల్ ప్రతి నెలా రూ.12 కోట్ల పన్నులు ప్రభుత్వానికి జమ కావాలి. అయితే అధికారులు ఏ నెలకు ఆ నెల వసూలు చేయకుండా బకాయిలను మరుగున పడేయడంతో అవి పేరుకుపోతున్నాయి. ఇటీవల నందిగామ సర్కిల్ పరిధిలో వెయ్యి మంది డీలర్లు రిటర్న్‌లు ఫైలు చేయకుండా రూ.12 కోట్ల మొత్తానికి ఎగనామం పెట్టి అదృశ్యమయ్యారు. ఇదిలా ఉండగా రిటర్న్‌లు దాఖలు చేసిన డీలర్లు కూడా సక్రమంగా పన్నులు చెల్లించక పోయినా సంబంధిత యూనిట్ల అధికారులకు చీమకూడా కుట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. భవానీపురం, కంచికచర్ల, జగ్గయ్యపేట యూనిట్లలో రూ.36 కోట్ల రిటర్న్‌లు ఫైల్ చేసిన డీలర్లు ప్రభుత్వానికి టాక్స్ బకాయి పడ్డారు. పాతబకాయిలు, రన్నింగ్ బకాయిలు కలిపి తడిసి మోపెడయ్యాయి. భవానీపురం యూనిట్లో ఫైళ్లు గల్లంతు భవానీపురం యూనిట్లో పాత బకాయిలకు సంబంధించి ఫైళ్లు గల్లంతయ్యాయని సమాచారం. దశాబ్దకాలంగా భవానీపురం యూనిట్లో బినామీ వ్యాపారాలు నకిలీ సంస్థలను స్థాపించి కోట్ల రూపాయల పన్నులు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. వారి ఆచూకీ తెలుసుకునేందుకు కనీసం ఫైళ్లు కూడా దొరకడం లేదని చెపుతున్నారు. ఇటీవల పాత ఇనుము అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి నందిగామ సర్కిల్ పరిధిలోని అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విజయవాడ భవానీపురం ఏరియాలో పాత ఇనుము వ్యాపారి గంగాధర్ ప్రభుత్వానికి రూ.25 కోట్ల పన్ను ఎగనామం పెట్టిన విషయం విదితమే. ఈ కేసులో నందిగామ సర్కిల్ పరిధిలో ముగ్గురు వాణిజ్యపన్నుల శాఖ అధికారులను ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా నందిగామ సర్కిల్ పరిధిలో పేరుకుపోయిన బకాయిలపై ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో బకాయిల వ్యవహారం బట్టబయలైంది. -
ఏసీబీ పంజా
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు అవినీతి చేప చిక్కింది. మంచిర్యాల డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి(డీసీటీవో) తొగరి పోచయ్య శుక్రవారం రూ.4 వేలు లంచం తీసుకుంటుం డగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి ఎరువుల దుకాణం యజమాని అయిలి సురేం దర్‌ను డీసీటీవో నెల రోజుల నుంచి లంచం కోసం వేధిస్తున్నాడు. ట ర్నోవర్ ట్యాక్స్, లెసైన్స్ ఫీజులు చెల్లించినా లంచం కోసం వేధించాడు. దుకాణం సీజ్ చేస్తామని బెదిరించాడు. డబ్బులు ఇస్తేకానీ లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో లోకాయుక్త విద్యాశాఖకు సర్టిఫికెట్ల పరిశీలన జరపాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ అధికారులు మూడుసార్లు సర్టిఫికెట్లు పరిశీలించినా పురోగతి సాధించలేదు. వీరి పదోన్నతి రివర్షన్ ఇవ్వాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ట్రిబ్యునల్‌కు వెళ్లి యథాస్థితి కొనసాగించేలా ఆదేశాలు పొందడంతో వ్యవహారం నాలుగేళ్లుగా ఎటూ తేలకుండా ఉంది. 2013 మార్చిలో ఈ అక్రమ పదోన్నతుల వ్యవహారం ప్రభుత్వం సీబీ సీఐడీకి అప్పగించింది. సీఐడీ అధికారులు మార్చి నెలలో విద్యాశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సీబీ సీఐడీ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు రెండుమూడ్రోజుల్లో అక్రమ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో అక్రమ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేయడంతో ఇక్కడి టీచర్లలో గుబులు మొదలైంది. క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. 93 మంది ఉపాధ్యాయులపై కేసులకు సిద్ధం 2009లో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నత చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందిన 180 మంది ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. వారిలో 93 మంది టీచర్ల సర్టిఫికెట్లు బోగస్ అని నిర్ధారించారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు జేఆర్‌ఎన్, వీఎంఆర్‌ఎఫ్, వినాయక మిషన్, యూటీఎస్ రాయ్‌పూర్ యూనివర్సిటీలకు వెళ్లి సర్టిఫికెట్లను పరిశీలించారు. వీరు జిల్లాలోనే ఉండి పరీక్షలకు హాజరుకానప్పటికీ సర్టిఫికెట్లు పొందారని తేలింది. ఒకేసారి రెండేళ్లు పీజీ కోర్సుకు సంబంధించిన పరీక్షలు రాసినట్లు, పాఠశాలల్లోని రిజిష్టర్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు సంతకాలు అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసినట్లు పరిశీలనలో తేలింది. ఇన్ సర్వీసులో ఉండి కోర్స్ చేయడంతో వీరిని బోగస్ సర్టిఫికెట్లు అని నిర్ధారించారు. సీబీ సీఐడీ నుంచి నివేదిక వచ్చిన వెంటనే వీరిపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం.