
సాక్షి, విజయవాడ: కంచె చేను మేసిన తరహాలో ఓ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారి అవినీతిపరులతో కుమ్మక్కయ్యాడు. అవినీతి అధికారులకు ముందుగానే ఏసీబీ దాడుల గురించి లీక్ చేసి.. వారు ఒడ్డున పడేలా వ్యవహరించాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏసీబీ రహస్య విభాగం మేనేజర్ శోభన్‌బాబుపై సస్పెన్షన్ వేటు పడింది.
అవినీతి అధికారులతో శోభన్‌బాబు కుమ్మక్కయి.. ముందుగానే ఏసీబీ దాడుల సమాచారాన్ని వారికి అందవేస్తున్నట్టు తాజాగా గుర్తించారు. 50మందికిపైగా అవినీతిపరులతో ఆయన సంప్రదింపులు జరిపినట్టు కాల్‌డేటా ఆధారంగా ఏసీబీ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో శోభన్‌బాబుపై శాఖపరమైన విచారణకు ఏసీబీ డీజీ ఠాకూర్ ఆదేశించారు. కాల్‌డేటా ఆధారంగా ఆయనపై కేసు నమోదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment