
శ్రీదేవి దగ్గర లంచం తీసుకుంటూ దొరికిపోయాడు
శ్రీదేవి అనే ఉద్యోగి నుంచి బీసీహెచ్ఎఫ్ కోఆర్డినేటర్ రామ్ మోహన్ లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.
కడప: ఏసిబి అధికారులు దాడులు చేసి ఎంతోమందిని పట్టుకుంటున్నప్పటికీ కొందరు అధికారులు మాత్రం లంచం తీసుకోవడం మానడంలేదు. అనేక మంది లంచం తీసుకుంటూనే ఉన్నారు. వారిలో కొందరు దొరికిపోతున్నారు. అయినా వారికి బుద్ధిరావడంలేదు.
ఈ రోజు ఇక్కడ శ్రీదేవి అనే ఉద్యోగి నుంచి బీసీహెచ్ఎఫ్ కోఆర్డినేటర్ రామ్ మోహన్ లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. రామ్ మోహన్ శ్రీదేవి నుంచి 20 వేల రూపాయలు తీసుకుంటుండగా వారు అదుపులోకి తీసుకున్నారు.
**