పలు రైళ్లకు అదనపు బోగీలు | Additional coaches Many trains | Sakshi
Sakshi News home page

పలు రైళ్లకు అదనపు బోగీలు

Published Tue, Oct 6 2015 3:10 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

Additional coaches Many trains

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్, విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన, విజయవాడ-చెన్నై పినాకిని, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ, సికింద్రాబాద్-కర్నూల్ తుంగభద్ర, కాచిగూడ-అకోల, విశాఖ-విజయవాడ రత్నాచల్ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement