
సాక్షి, అమరావతి: ఇంగ్లీష్ మీడియం విద్యపై టీడీపీ ద్వంద వైఖరి బయటపడిందని విద్యాశాఖమంత్రి ఆదిములపు సురేష్ మండిపడ్డారు. మంత్రి సురేష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంగ్లీష్ మీడియానికి అనుకూలమని అసెంబ్లీలో చెప్పాడు.. కానీ ఆయన కుమారుడు లోకేష్ మాత్రం శాసనమండలిలో ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబుకి ఇంగ్లీష్ విద్య బడుగు, బలహీన వర్గాలకు అందించడం ఇష్టంలేదని సురేష్ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రతి విషయంలోనూ ద్వంద వైఖరినే అవలంభిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
సమైక్యాంధ్ర, ప్రత్యేకహోదా విషయంలో కూడా చంద్రబాబు ఇలానే ద్వందవైఖరి అవలంభించాడని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంతో ఎస్సీ కమిషన్ ఏర్పాటుపైన కూడా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని ఆయన విమర్శించారు. దళితులకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండు మంత్రి పదవులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారని కొనియాడారు. దీంతోపాటు మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది సీఎం జగన్ అని మంత్రి ఆదిములపు సురేష గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment