సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై పనిగట్టుకుని అవాస్తవ ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం ఏపీ సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెడుతున్నామని.. విద్యార్థులకు చిక్కీలు, గుడ్లు అందిస్తున్నామన్నారు. వీటి పై టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమాలన్న వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
చదవండి: టీడీపీ దిగజారుడు రాజకీయం
విద్యార్థులకు చిక్కీలు కోసం రూ.350 కోట్లు ఖర్చు చేశామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా చేశామని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అవినీతికి ఆస్కారమే లేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఎక్కువ మొత్తంతో చిక్కీలు కొన్నాం. కానీ దానిని కూడా అవినీతి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సురేష్ నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment