39 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు పెంపు | AFRC to declare hike fee for 39 engineering colleges | Sakshi
Sakshi News home page

39 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు పెంపు

Published Sat, Aug 23 2014 2:49 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

AFRC to declare hike fee for 39 engineering colleges

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 39 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజులను పెంచుతూ ప్రవేశ ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది. గత ఏడాది తమకు ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ధారించిన ఫీజు సరిపోదని 104 కాలేజీలు అప్పుడే కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆయా కాలేజీల ఆదాయ, వ్యయాలను మళ్లీ పరిశీలించి ఫీజులను నిర్ణయించాలని ఏఎఫ్‌ఆర్‌సీని ఆదేశించింది. దీంతో  ఏఎఫ్‌ఆర్‌సీ అనేక దఫాలుగా కళాశాలలతో సమావేశాలు నిర్వహించింది.
 
వాటి ఆదాయ, వ్యయాలను పరిశీలించి చివరకు 39 కాలేజీల్లో ఫీజులను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు తవు సిఫారసులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఇటీవలే పంపించింది. దీంతో ఫీజుల పెంపుపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నారుు. ఈ ఫీజులు 2013-14, 2014-15, 2015-16 విద్యా సంవత్సరాల్లో వర్తిస్తాయి. ఈ నిర్ణయుం వల్ల ఆయా కాలేజీల్లో గత ఏడాది చేరిన విద్యార్థులు, ప్రస్తుతం చేరబోయే విద్యార్థులు పెరిగిన ఫీజులను చెల్లించాల్సి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement