పూర్తి అయినతరువాత ఎన్టీఆర్ పేరుపై నిర్ణయం | After completion of the capital will be take a decision on the name of NTR | Sakshi
Sakshi News home page

పూర్తి అయినతరువాత ఎన్టీఆర్ పేరుపై నిర్ణయం

Published Thu, Sep 4 2014 5:12 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

పూర్తి అయినతరువాత ఎన్టీఆర్ పేరుపై నిర్ణయం - Sakshi

పూర్తి అయినతరువాత ఎన్టీఆర్ పేరుపై నిర్ణయం

హైదరాబాద్: ఏపి రాజధాని నిర్మాణం పూర్తి అయిన తరువాత ఎన్టీఆర్ పేరు పెట్టడంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు శాసనసభలో చెప్పారు. రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని టిడిపి సభ్యులు కొందరు కోరారు. దానికి సమాధానంగా రాజధాని పూర్తిగా ఏర్పడిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు.  హైకోర్టు ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

రాజధాని ఎంపికలో తమకు రహస్య ఎజండా ఏమీలేదన్నారు. విజయవాడ పరిసరాల్లో భూమి గుర్తించిన తరువాత నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. భూసేకరణపై ఇప్పటికే మంత్రులు రైతులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. పరిపాలనా భవనాలన్నీ ఒకే చోట నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement