మొన్నటి వరకూ పగటివేళ నిప్పులు చెరిగిన ఆకాశం.. ఇప్పుడు పగలూరాత్రీ తేడా లేకుండా నీటిధారలు కురిపిస్తోంది. మొన్నటి వరకూ వడగాలి జడిపిస్తే.. ఇప్పుడు జడివాన వణికిస్తోంది. వరుసగా రెండోరోజూ కురిసిన వర్షంతో జిల్లా తడిసి ముద్దవుతోంది.
పిఠాపురం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా వానలు పడుతూనే ఉన్నారుు. ఓ వైపు కడలి అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండగా, మరోవైపు కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నారుు. పలుచోట్ల జనజీవనానికి అంతరాయం కలిగే స్థారుులో వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ, కోనపాపపేట, సఖినేటిపల్లి మండలం అంతర్వేది తదితర ప్రాంతాల్లో కడలి అలలు విరుచుకుపడడంతో తీరం కోతకు గురవుతోంది. కాకినాడ- ఉప్పాడ బీచ్‌రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రంలో చేపల వేటపై తాత్కాలిక నిషేధం విధించిన అధికారులు చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసారు. జిల్లావ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాలలో సిబ్బందిని అప్రమత్తం చేశారు.
జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలతో పాటు పలు పట్టణాల్లో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. డ్రెరుునేజీ వ్యవస్థ లోపభూరుుష్టంగా ఉండడంతో మురుగుకాలువల్లోని రోడ్ల పైకి పొర్లింది. సామర్లకోట, కాకినాడ తదితర ప్రాంతాలలో బస్‌స్టేషన్లు నీట మునిగాయి. కొత్తపల్లి, పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లలోకి నీరు చేరడంతో రికార్డులు భద్రపరచడానికిపోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఈదురు గాలులకు విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో అనేక గ్రామాలు శుక్రవారం రాత్రి చీకట్లో మగ్గుతున్నాయి.
ఏజెన్సీలో భారీ వర్షం కారణంగా కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తూ రహదారులను ముంచెత్తారుు. ఈ కారణంగా అనేక చోట్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయూరుు. వర్షం కారణంగా కొన్ని చోట్ల అపరాలు, కూరగాయల పంటలు దెబ్బ తిన్నారుు. మొలకెత్తుతూ ఉన్న నారుమడులకు కూడా ఈ వర్షం నష్టమేనని రైతులు అంటున్నారు. కాగా వర్షం కొన్ని రకాల వాణిజ్యపంటలకు మేలేనంటున్నారు.
తడిసి ముద్దయిన తూర్పు
Published Sat, Jun 20 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM
Advertisement