ఆయా సీజన్లలో పండించే పంటలు, వాటి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెలకువలపై పూర్తి సమాచారాన్ని అం దించేందుకు వీలుగా వ్యవసాయ శాఖ ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
దోమ, న్యూస్‌లైన్: ఆయా సీజన్లలో పండించే పంటలు, వాటి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెలకువలపై పూర్తి సమాచారాన్ని అం దించేందుకు వీలుగా వ్యవసాయ శాఖ ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతులకు కావాల్సిన సమాచారాన్ని పూర్తిగా తెలుగులో అందించేందుకు వీలుగా ఇటీవల ‘అగ్రిస్‌నెట్’ పేరుతో కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో పండించే పంటల వివరాలు, సలహాలు, సూచనలతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. కొద్దిపాటి కంప్యూటర్ పరిజ్ఞానమున్న రైతులు సైతం ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకునేలా సౌలభ్యం కల్పించారు.
అందుబాటులో సమస్త సమాచారం
అగ్రిస్‌నెట్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే స్క్రీన్‌పై ఎడమవైపున వ్యవసాయానికి సంబంధించి పలు రకాల అంశాలకు సంబంధించిన సమాచార వివరాలు కనిపిస్తాయి. పంటల యాజమాన్యం, అంతర పంటల వివరాలు, సమగ్ర సస్యరక్షణ, శ్రీ వరి సాగు, మార్కెట్‌లో కూరగాయలు, పంటల ధరలు, వ్యవసాయ అనుబంధ శాఖల వివరాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తది తర అంశాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి. వీటితో పాటు రైతుల విజయగాథలు, ప్రశ్నలు - సమాధానాలు, వ్యవసాయ అధికారుల ఫోన్ నంబర్లు, ఆయా పథకాల వినియోగానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు, ప్రకృతి వైపరీత్యాలు- వాటి నివారణా మార్గాలు, వ్యవసాయ డీలర్ల వివరాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ ఇలా అన్ని రకాల వివరాలు ఉంటాయి. వాటిపై క్లిక్ చేస్తే చాలు ఆయా అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది.
ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ..
వ్యవసాయ అభివృద్ధితో పాటు రైతుల ఉపయోగార్థమై ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కల్పిస్తున్న సబ్సిడీ సదుపాయం తదితర అంశాలకు సం బంధించిన సమాచారాన్ని సైతం వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. భూసార పరీ క్షలు చేసే విధానం, కలిగే ప్రయోజ నాలు, మార్కెట్‌లో పంటల మద్దతు ధరలను సైతం అందుబాటులో ఉం చారు. మొత్తంగా చూస్తే రైతులకు సం బంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఈ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.