నీరు-చెట్టు పేరుతో వ్యవసాయ బావుల పూడ్చివేత
రాజకీయ కక్షతో అధికారపార్టీ నేతల దౌర్జన్యం
పంట ఒబ్బిళ్ల సమయంలో ప్రతాపం చూపారని బాధితుల ఆందోళన
శ్రీకాళహస్తి రూరల్: నీరు-చెట్టు కార్యక్రవుం వుుసుగులో అధికార పార్టీకి చెందిన నాయుకులు రాజకీయ కక్షతో రైతుల బావులను పూడ్చేశారు. ఈ సంఘటన సోవువారం శ్రీకాళహస్తి వుండలం వుుచ్చివోలులో చోటుచేసుకుంది. వుుచ్చివోలు చెరువు కట్ట సమీపంలో పొరంబోకు స్థలంలో సువూరు 25 వుంది రైతులు బోర్లు, బావులు తవ్వుకుని పంటలు పండిస్తున్నారు. ఈ క్రమంలో నీరు-చెట్టు పథకం కింద రూ.20 లక్షలతో పనులు చేపట్టిన అధికార పార్టీ నాయకులు గత ఎన్నికల్లో తవుకు వ్యతిరేకంగా పనిచేశారనే నెపంతో ఏడుగురు రైతుల బావులను సోవువారం జేసీబీల సాయుంతో పూడ్చేశారు. బావులకు అవుర్చిన విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు, ఆరుుల్ ఇంజిన్లు, పైపులైన్లు ధ్వంసం చేశారు.
దాంతో బిళ్లు క్రిష్ణయ్యుయూదవ్, బిళ్లు వుురళీయూదవ్, బిళ్లు రావుచంద్రయ్యుయూదవ్, బిళ్లు గురవయ్యుయూదవ్, అక్కుపల్లి నరసింహులు యూదవ్, రవుణయ్యుయూదవ్, నరసయ్యు తమ 25 ఎకరాల పొలంలో సాగుచేసిన వేరుశనగపంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. పంట చేతికందే తరుణంలో తవుపై ప్రతాపం చూపడం భావ్యం కాదని, పంట ఒబ్బిళ్ల తర్వాత పనులు చేసుకోవాలని కాళ్లావేళ్లా పడి ప్రాధేయుపడినా కనికరం చూపలేదని బాధితులు ఆవేదనవ్యక్తంచేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వురో 18వుంది అగ్రవర్ణాల బడా రైతుల బావులను వూత్రం పూడ్చకుండా వదిలేశారని వారు చెప్పారు.