మహబూబ్‌నగర్ సాక్షి ప్రతినిధి: రైతులు పంట రుణాలు పొందేం దుకు గడువు సమీపిస్తున్నా బ్యాంకర్లు పెద్దగా స్పందించకపోవడంతో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా మారింది. కొత్త రుణాలు ఇవ్వాలంటేనే బ్యాంకర్లు ముం దుకు రావడంలేదు. కేవలం గతంలో ఇచ్చిన రుణాలను మాత్రమే రెన్యువల్ చేసి చేతుల దులుపుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురి యడంతో ఖరీఫ్ పంటలను సకాలంలో సాగుచేశారు.
దీంతో పంట పెట్టుబడుల కోసం రైతుల వద్ద డబ్బుల్లేక రుణాలను రెన్యువ ల్ చేయలేకపోతున్నారు. మరోవైపు పంట రుణాలు మాఫీ అవుతాయోమోననే కారణంతో చాలామంది తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకర్లే గ్రామాలకు వెళ్లి రెన్యువల్ చేసుకోవాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నా రు. గతేడాది పంటలు కోల్పోయిన రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో ఇన్‌పుట్ సబ్సిడీ ప్రభుత్వం మం జూరు చేస్తోందని ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది రూ.1251కోట్ల పంట రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయిం చగా, ఇప్పటివరకు రూ.930కోట్లు రుణాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే తీసుకున్న పంట రుణాలకు వడ్డీమాఫీ అందాలంటే ఈ ఏడాదిలోపే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 50 శాతం మంది రైతులు కూడా రెన్యువల్ చేసుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీని సకాలంలో సద్వినియోగం చేసుకోకపోతే వడ్డీ మాఫీ వర్తించదని, బ్యాంకు అధికారులు గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నా స్పందన కనిపించడం లేదు. కనీ సం తమ గ్రామాల్లో ఎవరికైనా కొత్త రుణాలిస్తే ఆ డబ్బుతో రెన్యువల్ చేసుకుందామని మిగతా రైతులు ఆలోచిస్తున్నా ఒక్కో గ్రామంలో 20మంది రైతులకు మించి కూడా కొత్తగా రుణాలు ఇవ్వడం లేదు. దీంతో ఖరీఫ్ రుణలక్ష్యం చేరుకోవడం కష్టంగామారింది.
లక్ష్యం పూర్తి చేస్తాం
రైతుల కోసం పంట రుణాల లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు కృషిచేస్తామని, సెప్టెంబర్ అఖరు నాటికి రూ..1251 కోట్లు రుణాలు ఇస్తామని లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. దీంతో రైతులు ఇబ్బంది లేకుం డా రుణాలు పొందేందుకు బ్యాంకర్లకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పంట రుణాలు తీసుకొన్న రైతులు ఏడాది లోపు రెన్యువల్ చేసుకుని వడ్డీమాఫీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రుణం గగనమే
Published Fri, Aug 30 2013 3:50 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement