అకాలం’.. కకావికలం | Akalam '.. devastated | Sakshi
Sakshi News home page

అకాలం’.. కకావికలం

Published Thu, Mar 6 2014 3:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అకాలం’.. కకావికలం - Sakshi

అకాలం’.. కకావికలం

మహబూబ్‌నగర్ వ్యవసాయం  అకాలవర్షాలు అన్నదాతను కకావిలకం చేశాయి.. చేతికొచ్చి న పంటలను నాశనం చేసి కోలుకోలేని దె బ్బతీశాయి.. అప్పుల బాధ నుంచి గట్టెక్కుతున్న తరుణంలో రైతన్నను నిలువునా ముంచాయి. జిల్లాలో నాలుగు రో జులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా లక్షల మేర పంటనష్టం వాటిల్లిం ది.

 

మామిడి, ట మాట, మిరప, కర్బూజ, పొగాకు సాగుచేసిన రైతులు తీవ్రనష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అలంపూర్ నియోజకవర్గంలో పంటనష్టం ఎక్కువగా ఉంది. జిల్లావ్యాప్తంగా 144.20 హెక్టార్లలో మొక్కజొన్న, 22 హెక్టార్లలో ఆ ముదం, 2.8 హెక్టార్లలో పప్పుశనగ పంటలు..ఇలా సు మారు రూ.14లక్షలు నష్టపోయినట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కొల్లాపూర్ మామిడికి మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో కొల్లాపూర్‌తో పాటు షాద్‌నగర్, కల్వకుర్తి తదితర ప్రాంతాల్లో మామిడి తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. ఈదురుగాలులతో కూడినవర్షాలు కురియడంతో ఇప్పుడిప్పుడే కాయదశలో ఉన్న పంటతీవ్రంగా దెబ్బతిన్నది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో మామిడికి తెగుళ్లువ్యాపించే అవకాశం ఉందని వ్యవసాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 

 

జిల్లాలో దాదాపు 200 హెక్టార్లలో రైతులు టమాటా పంటను నష్టపోయారు. గాలివానకు షాద్‌నగర్, కొ త్తూరు, వనపర్తి, కల్వకుర్తి, జడ్చర్ల  ప్రాంతాల్లో విరగకాసి న టమాట పండ్లు గాలులకు నేలకొరిగి పాడైపోయాయి. అలంపూర్, అయిజ, గద్వాల ప్రాంతాల్లో వర్షానికి ఎండుమిర్చి తడిసి బూజుపట్టే అవకాశం ఉంది. పొలంలో ఉన్న పంటకు కూడా తెగుళ్లుసోకే అవకాశం ఉంది. అలాగే వడగండ్ల వానకు దేవరకద్ర, నారాాయణపేట, మరికల్ త దితర ప్రాంతాల్లో కర్బూజ పంటకు నష్టం వాటిల్లింది.
 

కొత్తూరు మండలంలోని ఎస్‌బీపల్లి, మామిడిపల్లి, సిద్ధాపూర్ గ్రామాల రైతులను అకాలవర్షం రైతులను నిలువునా ముంచింది. చేతికొచ్చిన మొక్కజొన్న, వరి పంటలు నీటి పాలయ్యాయి. అలాగే శ్రీనివాసులుగూడ, ఈదులపల్లి, ఎ స్‌బీపల్లి, సిద్ధాపూర్ గ్రామాల్లో సుమారు 150 ఎకరాల్లో వ రి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మిరి, టమాట నేలకొరిగింది. మండ ల వ్యవసాయ అధికా రి మధుసూదన్ ఆధ్వర్యంలో అధికారులు పంటనష్టాన్ని పరిశీలిస్తున్నారు.

 

  గట్టు మండలంలో పొగాకు రైతుకు తీవ్రనష్టమే మిగి లింది. సోమ, మంగళవారం కురిసిన వర్షాలకు ఆరుబ యట ఆరబెట్టిన పొగాకు తడిసిముద్దయింది. గట్టు, గొర్లఖాన్‌దొడ్డి, ఆరగిద్ద, తప్పెట్లమొర్సు, మాచర్ల, యల్లందొ డ్డి, బల్గెర, ఇందువాసి, బోయలగూడెం గ్రామాలతో పాటు మిగతా గ్రామాల్లోనూ రబీలో రైతులు బోరునీటి ఆధారం గా పొగాకును సాగుచేశారు. చేతికొచ్చిన పంటను మరికొద్దిరోజుల్లో విక్రయించే సమయంలో అకాలవర్షం నష్టాన్ని మిగిల్చింది. ఇలాగే ఇటిక్యాల మండలంలోని పలు గ్రా మాల్లో ఆరబెట్టిన పొగాకు తడిసిముద్దయింది.
 

శాంతినగర్ మండలంలోని పలు గ్రామాల్లో మిర్చిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. కల్లాల్లో ఉంచిన మిరప, జొ న్న, పశుగ్రాసాలు తడిచిపోయాయి. ఎండిన మిరప రంగు మారుతుందని, దీంతో ధర పడిపోయే అవకాశం ఉందని మిర్చి రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తడిచిన జొన్న, మిరప పంటలను మార్కెట్‌ధరకు కొనుగోలుచేయాలని, పశుగ్రాసం ఉచితంగా మంజూరుచేసి ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement