సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన నేపథ్యం లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొద్ది రోజు లుగా మౌనం పాటించారు. గురువారం ఆయ న విలేకరుల సమావేశంలో సమైక్య స్వరాన్ని వినిపించారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణవాదులు తీవ్రస్థాయిలో ఆయనపై విరుచుకుపడ్డారు. శుక్రవారం టీఆర్‌ఎస్, బీజేపీ, విద్యార్థి సంఘాలు, రాజకీయ జేఏసీ, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించి కూడళ్ల వద్ద దహనం చేశారు. కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, డిచ్‌పల్లి, బాల్కొం డ, వేల్పూర్, బోధన్, నిజామాబాద్, జుక్కల్ తదితర ప్రాంతాల్లో ఆందోళనకారు లు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించా రు. విద్యుత్, సాగునీరు, ఉద్యోగాలు, అభివృద్ధి విషయాల్లో సీఎం మాట్లాడిన తీరుపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. రాష్ట్రం విడిపోతే తెలంగాణకే నష్టం అన్నట్లుగా సీఎం అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. నిజామాబాద్ నగరంలో టీఆర్‌ఎస్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద నాయకులు, కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మకు ఉరివేశారు. టీఆర్‌ఎస్ యువజన విభాగం, టీఆర్‌ఎస్‌వీ ల ఆధ్వర్యంలో వేరువేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
బోధన్‌లో టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యం లో, వేల్పూర్, కామారెడ్డి, నిజామాబాద్ మండలంలోని ధర్మారం(బి), సిరికొండ, ఎల్లారెడ్డిల్లో టీఆర్‌ఎస్, బీజేపీల ఆధ్వర్యంలో వేరువేరుగా సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు జరుగుతున్న సమయంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చర్యలను ఖండించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.
జిల్లావ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మల దహనం
Published Sat, Aug 10 2013 4:05 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement