tealangana
-
తెలంగాణలో నకిలీ మెడిసిన్స్ దందా
-
కత్తిపోటుతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చిన్ని పేగుకు గాయం
-
TS SSC Exam 2023: పిల్లకాకిపై ఉండేలు దెబ్బ!
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ; రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీ ఈఆర్టీ) వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అటు విద్యార్థులనూ, ఇటు ఉపాధ్యాయులనూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అటువంటి వివాదాస్పద ఉత్తర్వుల జాబితాలో తాజాగా 2022 డిసెంబర్ 28న పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఇచ్చిన జీఓఎమ్ఎస్ నం. 33 ఒకటి. వాస్తవానికి ఈ ఉత్తర్వు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సి ఉండగా సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు 11 పేపర్లుగా రాసిన అనంతరం చాలా ఆలస్యంగా డిసెంబర్లో మేలుకోవడమే విద్యా శాఖ అలసత్వానికి నిదర్శనం. కోవిడ్‌కు ముందు 10వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించేవారు. హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లను రెండు పేపర్లుగా విభజించి పరీక్షలు నిర్వహించేవారు. గత రెండు, మూడు ఏళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా భౌతికంగా తరగతులు సరిగా జరుగకపోవడం వల్ల, విద్యార్థులు ఆన్లైన్ తరగతులు సరిగా వినకపోవడం వల్ల విద్యార్థుల్లో తగ్గిన అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని పేపర్ల సంఖ్య తగ్గించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర విద్యాశాఖ జీఓ 33 ద్వారా 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గించడంతో పాటుగా... ఎస్సీఈఆర్టీ ద్వారా మోడల్ పేపర్లను కూడా విడుదల చేసింది. కానీ ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ రెండు సబ్జెక్ట్‌ల పరీక్షలను ఒకేరోజు ఒక్కొక్క పేపర్‌ను ఒక గంట ముప్పై నిమిషాలపాటు నిర్వహించాలని ఉత్వర్వులలో పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది. వాస్తవానికి నిర్వాహణలో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక పేపరు రాసిన వెంటనే ఆ పేపరును తీసుకొని మరో పేపరును విద్యార్థికి స్పల్ప సమయం తేడాతో ఇస్తారు. రెండు పేపర్లను చదువుకోవడానికి మరో ఇరవై నిముషాల సమయం అదనంగా ఇచ్చినా మూడు గంటల ఇరవై నిముషాల పాటు ఈ రెండు పరీక్షలు ఒకే రోజు నిర్వహించడం వలన విద్యార్థికి చాలా అన్యాయం జరుగుతుంది, ఇటు పరీక్ష నిర్వాహకులకూ ఇబ్బందే. అందుకని ఈ రెండు పరీక్షలను వేరు వేరు రోజులలో నిర్వహించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్‌తో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గతంలో ఒక్కొక్క సబ్జెక్ట్ రెండు పేపర్లు ఉండగా ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లోని అన్ని పాఠాలను మొత్తం చదివి ఒకే రోజు పరీక్షను రాయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరమున్నది. రెండు పేపర్ల విధానంలో పరీక్షలు ఉన్న సందర్భాలలో సంక్షిప్తరూప ప్రశ్నలు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను పెంచడం వలన రాసే సమయం అధికంగా పెరగడమేకాక, ఛాయిస్ విధానాన్ని తగ్గించడం వలన విద్యార్థులు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి సమయం సరిపోక 10 జీపీఏను సాధించడం కష్టంగా మారింది. అలాగే 2022 డిసెంబర్ 30 నాడు స్పెషల్ రివిజన్ క్లాసుల పేరిట ఎస్సీఈఆర్టీ వారు మరో వివాదస్పద ఉత్తర్వును ఇచ్చారు. వారాంతపు సెలవులను, సెలవు దినాలను కూడా మినహాయించకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలనేది దాని సారాంశం. ఇది ఇబ్బందులతో కూడుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో... చుట్టుపక్కల రెండు, మూడు గ్రామాల నుండి విద్యార్థులు తమ హైస్కూల్‌కు వస్తారు. ముఖ్యంగా అమ్మాయిలను సాయంత్రం 6 గంటల వరకు ఉంచడం వల్ల... తలెత్తే రవాణాసౌకర్యం సమస్య ఎలా పరిష్కరించాలి. ముఖ్యంగా భద్రతాపరమైన అంశాలపై జవాబుదారు ఎవరనే ప్రశ్న తలెత్తుతున్నది. పాఠశాలలో కేవలం మధ్యాహ్నా భోజన సౌకర్యం మాత్రమే ఉన్నది. ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు విద్యార్థులకు ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ ఎవరివ్వాలి? జాయిఫుల్ లర్నింగ్‌కు, ఆర్టీఈకి విరుద్ధంగా వారాంతపు, ప్రభుత్వ సెలవు దినాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఎస్సీఈఆర్టీ గతంలో ఎప్పుడూ నేరుగా ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చేది కాదు. ఏ ఆదేశాలైనా పాఠశాల విద్యాశాఖాద్వారానే వచ్చేవి. కాని ఈ మధ్యకాలంలో నేరుగా పాఠశాల విద్యాశాఖతో సంబంధం, సమన్వయం లేకుండానే పాఠశాలకు సంబంధించిన పనిదినాలపైనా, సెలవులపైనా పాఠశాల విద్యాశాఖ జారీచేసిన అకడమిక్ క్యాలెండర్‌కు భిన్నంగా ఎస్సీఈఆర్టీ దాని పరిధిని దాటి ఆదేశాలు ఇస్తోంది. దీంతో అసలు ఎవరి ఆదేశాలను పాటించాలో అర్థంకాక ఉపాధ్యాయులలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకొని వివాదాలు లేకుండా రాష్ట్ర విద్యాశాఖ, టీఎస్‌ఎస్‌సీఈఆర్‌టీలు ఇప్పటికైనా విధానాల రూపకల్పన చేస్తే భవిష్యత్తులో ఎటువంటి విమర్శలు, వివాదాలు లేకుండా విద్యావ్యవస్థ సజావుగా కొనసాగుతుంది! (క్లిక్ చేయండి: రామప్ప దేవాలయానికి పొంచి ఉన్న ముప్పు) - డాక్టర్ ఏరుకొండ నరసింహుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్ యూనియన్ -
Pakhal Tirumal Reddy: వేయి రేఖల వినూత్న సౌందర్యం
పీటీ రెడ్డిగా విఖ్యాతులైన పాకాల తిరుమల రెడ్డి (1915– 1996) ప్రపంచ స్థాయికి చెందిన తెలంగాణ కళాకారుల్లో అగ్రగణ్యుడు. కరీంనగర్ జిల్లా, అన్నవరం గ్రామంలో 1915 జనవరి 4వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్య చదివే రోజుల్లో ఆయన్ని ప్రోత్సహించింది ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సత్తార్ సుభాని. తన బంధువును కలిసేందుకు ఒక రోజు రెడ్డి హాస్టల్‌కు వెళ్లాడు పీటీ. ఆ రోజు స్కౌట్స్ డే. ముఖ్య అతిథి బాడెన్ పావెల్. బాడెన్ రూపానికి 17 ఏండ్ల పీటీ కాంతి వేగంతో ప్రాణం పోస్తున్నారు. అది గమనించిన కొత్వాల్ పీటీని పిలిపించుకొని తన పెయింటింగ్ వేస్తావా అని అడిగారు! మిడాస్ టచ్!! రెడ్డి హాస్టల్ నిబంధలను సవరించి ప్రతిభావంతులైన కళాకారులకూ స్కాలర్షిప్ ఇవ్వవచ్చని పీటీని ‘సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చేర్పించారు కొత్వాల్. ముంబైలోని ఆ వినూత్న ప్రపంచంలో సూజా, కేకే హెబ్బార్, ఎమ్ఎఫ్ హుస్సేన్ తదితరులు సహ విద్యార్థులు. తన 22వ ఏట చిత్రించిన సెల్ఫ్ పోర్ట్రెయిట్ అంతర్ వ్యక్తినీ చూపిందని అధ్యాపకులు మెచ్చుకున్నారు. జేజేలో 1935 నుంచి 42 వరకు చిత్రకళను అభ్యసించి డిప్లొమా పొందారు, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ర్యాంక్‌తో! దేశ విభజన సందర్భంలో హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ మాండలికాన్ని తన రచనలలో శాశ్వతం చేసిన యశోదా రెడ్డిని వివాహం చేసుకున్నారు. కార్పెంటరీ ఇండస్ట్రీ నెలకొల్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ హుందాతనాన్ని తెలిపే ఫర్నిచర్ పీటీ రెడ్డి సమకూర్చిందే. శిల్పీ, దారుశిల్పీ; ఆయిల్, వాటర్ కలరిస్ట్ అయిన పీటీ కళా ప్రపంచానికి కానుకగా ఏమి ఇచ్చారు? ఒక్క మాటలో భారతీయ సాంస్కృతిక తాత్విక సౌందర్య భరిత వేయి దళాల పరిమళ భరిత పుష్పం! మన జ్ఞాపకాల పొరల్లో మసకబారిన ఆ కళారూపాలు చూడవచ్చా? ‘స్వధర్మ’లో మూడు అంతస్తులలోని ప్రత్యేక గ్యాలరీలలో పీటీ రెడ్డి కళా రూపాలు కొలువై ఉన్నాయి. వారి కుమార్తె లక్ష్మీ రెడ్డి దంపతులు ఎంతో శ్రద్ధగా కాపాడుతున్నారు. చిరునామా సులభం. నారాయణగూడ మెట్రో పిల్లర్ 1155. కళాకారులు, చరిత్రకారులు అపా యింట్మెంట్ తీసుకుని సందర్శించవచ్చు. (క్లిక్ చేయండి: అతడి మరణం ఓ విషాదం!) - పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ (జనవరి 4న పీటీ రెడ్డి జయంతి) -
ఎస్సై పరీక్ష.. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి అభ్యర్థులు శనివారం నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష కోసం ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వారి ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రింట్ తీసుకున్న హాల్‌టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్‌టికెట్‌తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. 11 నుంచి పీజీ ‘ఎంట్రెన్స్’ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్సీపీగేట్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినందున నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. టైంటెబుల్, ఇతర వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు. గెస్ట్ లెక్చరర్ల వేతనం పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఒక్కో అధ్యాకుడికి నెలకు రూ.6,480 అదనంగా లభి స్తుంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున, నెలకు 72 పీరియడ్లకు (గ రిష్టంగా) రూ.21,600 వేతనం వచ్చేది. ఇప్పు డు 30% పెంచడంతో పీరియడ్‌కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 రానుంది. ఈ పెంపును ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నేతలు మాచర్ల రామకృష్ణ, కొప్పిశెట్టి సురేశ్, పోలూరి మురళి స్వాగతించారు. గురుకుల ఐదో తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా నిర్దేశించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని గురుకుల సెట్ కన్వీనర్ రోనాల్డ్‌రాస్ శుక్రవా రం ప్రకటనలో కోరారు. ఈనెల 29వ తేదీతో రిపోర్ట్ చేయాలని ముందుగా గడువు విధించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల వినతులను పరిగణించి గడువు తేదీని ఆగస్టు 1 వరకు పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు. 31న సబ్ ఇంజనీర్ పోస్టులకు పరీక్ష సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) లో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్షను ఈనెల 31న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపిణీ చేశామని, హాల్‌టికెట్లు అందని వారు సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నేడు, రేపు అగ్రి ఎంసెట్ సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా వాయి దాపడిన మెడికల్, అగ్రికల్చర్ ఎంసెట్ శని, ఆదివారాల్లో జరగనుంది. పరీక్షకు మొత్తం 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 68, ఏపీలో 18.. మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఎంసెట్ కోసం ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రోజుకు 2 విభాగాలుగా జరుగుతుందని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఎంసెట్ ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పరీక్షను ఒకరోజు ముందు వాయిదావేశారు. అగ్రికల్చర్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేస్తామని కన్వీనర్ తెలిపారు. నేడు ఇంజనీరింగ్ ఎంసెట్ ‘కీ’విడుదల ఈ నెల 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని శనివారం విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆగస్టు రెండోవారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. -
కోర్ బ్రాంచ్‌ల డోర్ క్లోజ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా ఇంజనీరింగ్ విద్యలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కంప్యూటర్ అనుబంధ కోర్సులు పూర్తిగా పైచేయి సాధిస్తు న్నాయి. ఫలితంగా కొన్ని బ్రాంచ్‌ల్లో సీట్లు అనివార్యంగా తగ్గించాల్సి వస్తోంది. భవిష్యత్‌లో అవి పూర్తిగా తెరమరుగయ్యే ప్రమాదం ఉందని సాంకే తిక విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. సామాజిక పరిస్థితుల నేపథ్యమే దీనికి ప్రధాన కారణమనే వాదన విన్పిస్తోంది. తాజా పరిస్థితిపై ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఓ అధ్యయనం కూడా చేసింది. ఇంజనీరింగ్ విద్య సామాన్యులకు అందుబాటులోకి వచ్చాక, సంప్ర దాయ డిగ్రీ కోర్సుల ప్రాధాన్యత తగ్గింది. అలాగే అన్నింటా సాంకేతికత అవసరంతో సరికొత్త కోర్సుల ప్రాధాన్యత పెరుగుతోంది. ఇది ఆహ్వానిం చదగ్గ పరిణామమే అయినా, మిగతా కోర్సులను రక్షించుకోకపోతే అర్థవంతమైన ఇంజనీరింగ్ విద్య సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకీ పరిస్థితి?: ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతోంది. సాంకే తికత లేకుండా ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు మెకానికల్‌కు సీఎస్ఈకి సంబంధం లేకున్నా.. ఏదైనా వాహనాన్ని డిజైన్ చేయాలంటే ముందుగా సాంకేతిక టెక్నాలజీతోనే చేస్తారు. కంప్యూటర్ టెక్నాలజీతోనే దాని సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాతే హార్డ్‌వేర్‌తో అవసరం. అలాగే ఎలక్ట్రానిక్స్‌తో రూపొందించే టీవీల తయారీలోనూ అత్యాధునిక ఐవోటీ టెక్నాలజీ కీలకం. సివిల్‌లోనూ ఇదే ధోరణి. నిర్మాణాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందుగా వినియో గించాలి. మానవ జీవితంలో అంతర్భాగమైన ఇంటర్నెట్ను గుప్పిట్లో పెట్టుకునేది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. డేటాసైన్స్ ఉపయోగమూ అంతాఇంతా కాదు. దీంతో కంప్యూటర్ అనుబంధ కోర్సులకు అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. తాజా ఎంసెట్ కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే 74,071 సీట్లు తొలి విడత భర్తీ చేస్తే అందులో 38,796 కంప్యూటర్, దాని అనుబంధ కొత్త బ్రాంచీల సీట్లే ఉన్నాయి. ప్రైవేటు పంట... కంప్యూటర్ అనుబంధ బ్రాంచ్‌ల్లో సీట్లకు ఉన్న డిమాండ్‌ను ప్రైవేట్ కాలేజీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ కోర్సులకు ఇష్టానుసారంగా డొనేషన్లు దండుకుంటున్నాయి. మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేసే 30 శాతం సీట్లను ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలుకాక ముందు నుంచే అమ్మేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఒక్కో సీటుకు రూ.10 లక్షలకు పైనే వసూలు చేశాయి. జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలు తీసుకొస్తే తప్ప డిమాండ్ తగ్గుతున్న కోర్సుల విషయంలో తామేమీ చేయలేమని రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి ఉన్నతాధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ కోర్సులే కాకుండా, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సుల్లో కూడా కంప్యూటర్ టెక్నాలజీతో పాఠ్యప్రణాళిక రావాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ కోర్సులు పూర్తి చేసినా.. తాము అంతిమంగా సాఫ్ట్వేర్ వైపే వెళ్లాలి కదా అనే అభిప్రాయం వాళ్లలో ఉందని చెబుతున్నారు. ఇదే ప్రైవేటు కాలేజీలకు కలిసి వస్తోందని నిపుణులు అంటున్నారు. తెలంగాణలో 2018–19లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సీట్లు 17,361 ఉంటే 2021 నాటికి అవి 18,614కు చేరాయి. అంటే ఈ రెండేళ్లలోనే 1,253 పెరిగాయి. తాజాగా హైకోర్టు తీర్పుతో మరో 3,500 పెరగబోతున్నాయి. ఎలక్ట్రికల్ కోర్సు (ఈఈఈ)లో సీట్లు 8,667 నుంచి 7,019 (1,648 తక్కువ)కు తగ్గాయి. సివిల్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెండేళ్ల క్రితం సివిల్ బ్రాంచ్ సీట్లు 8,293 ఉంటే ఇప్పుడు 6,221 (2072)కు తగ్గాయి. మెకానికల్ పరిస్థితి చెప్పుకోలేని స్థాయికి దిగజారింది. ఈ బ్రాంచ్‌లో 2018–19లో 10,104 ఉంటే, ఇప్పుడు 5,881 (4,223) సీట్లున్నాయి. సీఎస్ఈ తర్వాత పాత్ర పోషించే ఎలక్ట్రానిక్స్ (ఈసీఈ)లోనూ 15,415 నుంచి 13,935 (2,210 తక్కువ) సీట్లకు చేరుకున్నాయి. ఏడాది కాలంలోనే కంప్యూటర్ అనుబంధ కోర్సులైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, ఇంటర్ ఆఫ్ థింగ్స్ బ్రాంచ్‌ల్లో 14,920 మంది కొత్తగా చేరడం విశేషం. కంప్యూటర్ కోర్సులే కాదు.. కోర్ సబ్జెక్టుల ప్రాధాన్యతను పెంచాల్సిన అవసరం ఉంది. జేఎన్టీయూహెచ్తో పాటు దేశవ్యాప్తంగా దీనిపై అధ్యయనం జరుగుతోంది. వ్యవస్థకు కోర్ ఇంజనీరింగ్ ఎప్పుడైనా అవసరం. యంత్రాలున్నంత కాలం సివిల్, మెకానికల్, ఎలక్ట్రిక్ కోర్సుల ప్రాధాన్యత ఉంటుంది. అయితే, వీటిని నేటి తరానికి, ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణనలోనికి తీసుకుని తీర్చిదిద్దాలి. ఈ ప్రయత్నంలో అఖిలభారత సాంకేతిక విద్యా మండలి కూడా దృష్టి పెట్టింది. – లింబాద్రి, రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్ -
తెలంగాణ రణాన్ని, నినాదాన్ని చాటినవాడు
తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఉద్యమనేత, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం, అక్కంపేట గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అధ్యాపకుడిగా, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకుల పతిగా సేవలు అందించిన జయ శంకర్ ఎప్పుడూ తెలంగాణ వాదాన్ని వదిలిపెట్ట లేదు. విద్యార్థిదశ నుంచి కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటు వంటి, నిర్మాణాత్మకమైన, నిక్కచ్చిౖయెన మనస్తత్వం గలవాడు ఆయన. తెలంగాణలో జరుగుతున్న ఆంధ్ర వలసవాదుల, సమైక్యవాదుల దోపిడీ నుండి తెలం గాణ విముక్తి కోసం కంకణం కట్టుకున్న విద్యావేత్త. మా వనరులు మాకున్నాయి, మా వనరులపై మాకు అధికారం కావాలని ప్రశ్నించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ ప్రజలు ఎన్నాళ్లు యాచించా లనే ఒక కసి, పట్టుదలతో 1952లో నాన్ ముల్కీ, ఇడ్లీ, సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, తనదైన శైలిలో కాకతీయ, ఉస్మానియా విశ్వ విద్యాలయాలలో విద్యార్థులు, ఆచార్యులతో సమా వేశాలు ఏర్పాటుచేసి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరంగా చెప్పారు. ఆయా విశ్వవిద్యా లయాలలో చదువుతున్న విద్యార్థులను, పరిశోధకు లను కూడగట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నం మరు వలేనిది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యావంతులు, మేధావులు ప్రతిఘటించాలనీ; ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలనీ; విద్యా వంతులమైన మనమే గళం విప్పకపోతే ఎలా? మేధా వులు సామాజిక బాధ్యతను విస్మరించడం క్షంతవ్యం కాదనీ వక్కాణించారు. నాలుగు గోడల మధ్యలో కుర్చొని, కేవలం నినా దాలు చేయడం ద్వారా సమస్యలకు పరిష్కారం ఉండదని బలంగా నమ్మిన వ్యక్తి జయశంకర్. అందుకే సమస్యలకు దారితీసిన కారణాలను సాక్ష్యా ధారాలతో, శాస్త్రీయంగా, గణాంకాలతో సహా నిర్భ యంగా, నిర్మొహమాటంగా విశ్లేషిస్తూ అనేక రచనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలం గాణ రణాన్ని, నినాదాన్ని చాటిచెప్పిన ప్రజ్ఞాశాలి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కల్వ కుంట్ల చంద్రశేఖరరావు తన వాణి, బాణీæ వినిపి స్తున్న క్రమంలోనే ప్రజల మద్దతుతో 2001లో తెలం గాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు. ఒకానొక సంద ర్భంలో జయశంకర్ మాట్లాడుతూ, ‘‘అబ్తో ఏకీ హీ ఖ్వాయిష్ హై, ఓ తెలంగాణ దేఖ్నా మర్ జానా (ఇప్పుడైతే నాకు ఒకే ఒక కోరిక మిగిలింది, అది చని పోయేలోగా తెలంగాణ ఏర్పాటు కళ్ళారా చూడటం); అది కేవలం తెలంగాణ మొనగాడు ‘రావు సాబ్’తోనే సాధ్యం అవుతుంది, తర్వాత నేను చనిపోవాలి’’ అని అన్న సందర్భాలు అనేకం. జయశంకర్ మార్గదర్శ కత్వంలో కేసీఆర్ ఆమరణ నిరాహరదీక్ష చేపట్టి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు గడగడలాడించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేయక తప్పలేదు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొనడం, ఖంగు తిన్న సమైక్యవాదులు ఆ ప్రకటనను జాతి వ్యతిరే కమైనదిగా, ‘కాగ్నిజబుల్ అఫెన్స్’గా పేర్కొనడం, తదుపరి జరిగిన పరిణామాలతో డిసెంబర్ 23న మరొక ప్రకటన చేసి, శ్రీకృష్ణ కమిటీ రూపంలో తెలం గాణ ప్రజలను గాయపరచడం జరిగింది. తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేసి, నిరవధికంగా ఉద్యమా లను చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తెచ్చిన ఫలితంగా 2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోకసభ ఆమోదం లభిం చింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్య నాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంతవరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, 2014 పిభ్రవరి 20న రాజ్య సభలో బిల్లుకు య«థాతథంగా మూజువాణీ ఓటుతో ఆమోద ముద్ర పడింది. 2014 జూన్ 2 నాడు దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ‘సారు’ కలల తెలంగాణ ఏర్పడింది. అయితే ప్రత్యేక తెలం గాణ రాష్ట్రాన్ని చూడకుండానే జయశంకర్ అనా రోగ్యంతో 2011 జూన్ 21న తుదిశ్వాస విడిచారు. -డా. సంగని మల్లేశ్వర్ వ్యాసకర్త విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ 98662 55355 (నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి) -
5 వేల హెచ్ఎం పోస్టులు భర్తీ చేయనున్నారా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో మరో 5 వేలకుపైగా ప్రధానోపాధ్యాయ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో 10 వేల వరకు హెడ్మాస్టర్ పోస్టులను మంజూరు చేసి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో అందుకు అవసరమైన కార్యాచరణపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తంగా 26,040 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 18,217 ప్రాథమిక పాఠశాలలు, 3,186 ప్రాథమికోన్నత పాఠశాలలు, 4,637 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 4,429లో ఫిమేల్ లిటరసీ (ఎల్ఎఫ్ఎల్) హెడ్మాస్టర్ పోస్టులు ఉన్నాయి. అయితే అవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంజూరు చేసినవే. ఉమ్మడి రాష్ట్రంలో 1997లో అప్పటి ప్రభుత్వం 10,647 ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టులను మంజూరు చేసింది. అందులో తెలంగాణలోని పది జిల్లాలకు 4,429 పోస్టులను కేటాయించింది. అందులో మహబూబ్‌నగర్‌కు 580, రంగారెడ్డికి 369, హైదరాబాద్‌కు 168, మెదక్‌కు 426, నిజామాబాద్‌కు 389, ఆదిలాబాద్‌కు 484, కరీంనగర్‌కు 562, వరంగల్‌కు 491, ఖమ్మంకు 460, నల్లగొండకు 500 పోస్టులను కేటాయించింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో అవి మాత్రమే ఉన్నాయి. అయితే ప్రాథమిక పాఠశాలలకు కూడా ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని, లేదంటే వాటి నిర్వహణ సమస్యగా మారడంతోపాటు ఉన్న ఒకరిద్దరు టీచర్లు నిర్వహణ సంబంధ అంశాలపై దృష్టి సారించాల్సి వస్తుండటంతో బోధన దెబ్బతింటోందని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇటీవల సీఎం కేసీఆర్‌తో సమావేశమైన సమయంలో పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ఉన్న పోస్టులతోపాటు మరిన్ని పోస్టులను ఇచ్చి ప్రాథమిక పాఠశాలల హెడ్మాస్టర్ పోస్టులను 10 వేలకు పెంచుతామని ప్రకటించారు. సీఎం ప్రకటన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న పోస్టులు ఎన్ని? అందులో ఎంత మంది రిటైర్ అయ్యారు? ఎన్నింటిలో మళ్లీ నియమించారన్న వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇలా గతంలో ఉన్న పోస్టుల ప్రకారం చూస్తే ఇప్పుడు మరో 5,571 ప్రధానోపాధ్యాయ పోస్టులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: హల్ది వాగుకూ జీవం.. -
ఉట్టిపడే ‘రాజసం’..
అందమైన భాగ్యనగరం మనది. ఘన చరిత్రకు సాక్ష్యం...అద్భుతమైన వారసత్వ సంపదకు నిలయం ఈ నగరం. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, ప్రాంతాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. చార్మినార్..గోల్కొండ.. అసెంబ్లీ భవనం.. చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, సాలార్జంగ్ మ్యూజియం, సర్దార్ మహల్, మహబూబ్ మాన్షన్, కింగ్ కోఠి ప్యాలెస్.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణాలు వారసత్వ కట్టడాలుగా ఖ్యాతి పొందాయి. కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరాన్ని ‘హెరిటేజ్ ఇండియా ఫెస్టివల్’గా ప్రకటించిన నేపథ్యంలో మన అసెంబ్లీ భవనం ప్రత్యేకతలపై ‘సాక్షి’ కథనం.. సాక్షి, హైదరాబాద్: మన శాసనసభ నిర్మాణానికి పునాదిరాయి పడి ఎన్నేళ్లయిందో తెలుసా? రేపటితో అక్షరాలా 116 సంవత్సరాలు. ఇది నిర్మించి ఒక శతాబ్దంపైనే పూర్తయ్యింది. అయినా ఈ భవనం చెక్కు చెదరలేదు. ఉట్టిపడే రాజసానికి ప్రతీక ఇది. అప్పటి ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర చరిత్రను మలుపుతిప్పిన అనేక కీలకఘట్టాలు ఈ శాసనసభా ప్రాంగణంలోనే చోటుచేసుకున్నాయి. అద్భుతమైన నిర్మాణ శైలితో కట్టించిన ఈ భవనం హైదరాబాద్ నగరంలోనే ఒక అపురూప కట్టడం. అసెంబ్లీ భవన నిర్మాణానికి 1905 జనవరి 25న అంకురార్పణ జరిగింది. ప్రజా సమస్యలకు వేదికగా అప్పటి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పచ్చని ఉద్యానవనంలో ఈ భవనం నిర్మాణానికి శ్రీకారం చు ట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఈ వేదిక నుంచే తమ వాణిని వినిపిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభు త్వం 2021ని చారిత్రక కట్టడాల పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ‘హైదరాబాద్ హెరిటేజ్’ను పురస్కరించుకుని అసెంబ్లీ భవనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం నిజాం నవాబు ప్రసంగించిన వేళ.. అది 1904వ సంవత్సరం.. ఓ రోజు నగరం అంతా సందడిగా ఉంది. ఢిల్లీలో జరిగిన సంస్థానాధీశుల దర్బార్ సమావేశాలకు వెళ్లిన మ హబూబ్ అలీఖాన్ ఆ రోజు సాయంత్రం నగ రానికి చేరుకోనున్నారు. ఆయన రాకకోసం జనం ఎదురుచూస్తున్నారు. సరిగా అయిదున్నర గంటల సమయంలో పబ్లిక్ గార్డెన్‌లోని సభాస్థలికి చేరుకున్నారు. మహబూబ్‌కు సాదర స్వాగతం లభించింది. ఆయన ప్రసంగించిన వేదిక చిరకాలం గుర్తుండిపోయేలా ఒక అందమైన భవనం కట్టించాలని తీర్మానించారు. అలా టౌన్‌హాల్ నిర్మాణానికి బీజం పడింది. హైదరాబాద్ సంస్థాన ప్రజలు చందాలు పోగుచేసి ఆ భవనాన్ని కట్టించారు. భవన శంకుస్థాపన ఇలా.. అప్పటికే ఎన్నో భవనాలు ఉన్నాయి. కానీ మంత్రులు, ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు, సాధారణ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఒక వేదిక లేదు. దీంతో 1905లో మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజు (హిజ్రీ క్యాలెండర్ ప్రకారం జనవరి 25) సందర్భంగా ఆయనకు నగరవాసుల బహుమానంగా అందమైన భవన నిర్మాణం చేపట్టారు. సమాజంలోని ఉన్నత వర్గాలే కాకుండా సాధారణ ప్రజలు సైతం తమవంతుగా విరాళాలు సమర్పించారు. ఈ కట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలు పరిశ్రమించారు. అద్భుతమైన నిర్మాణ శైలి.. ఈ భవనం అందమైన గోపురాలు, ఆకాశాన్ని తాకే శిఖరాలు, మరెంతో అందంగా తీర్చిదిద్దిన డోమ్లతో ఆకట్టుకుంటుంది. భవనం గోడలపై మంత్రముగ్ధులను చేసే డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికీ దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులను, పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇరానీ, మొగలాయి, రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలులతో దీన్ని కట్టించారు. టౌన్ హాల్ నిర్మా ణం కోసం రాజస్థాన్‌లోని మఖ్రా నా నుంచి రాళ్లను తెప్పించారు. రెండంతస్తులతో ని ర్మించిన టౌన్‌హాల్ చు ట్టూ 20 గదులు ఉంటా యి. గోపురాల కోసం డంగు సున్నం, బంకమట్టి వినియోగించారు.గోపురాలు, కమాన్లు మొగలాయి వాస్తు శైలిని సంతరించుకుంటే గోడలపై రూపొందించిన కళాత్మక దృశ్యాలు, లతలు, వివిధ రకాల డిజైన్లు ఇరాన్, రాజస్థానీ శైలులతో రూపుదిద్దుకున్నాయి. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకొనేలా దీనిని కట్టించారు. చక్కటి గాలి, వెలుతురు వస్తాయి. చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటుంది. పచ్చిక బయళ్లతో పరిసరాలు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. అప్పట్లో రూ.20 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. 1913లో నిర్మాణం పూర్తయ్యింది. మహబూబ్ అలీఖాన్ 1911లోనే చనిపోవడంతో ఆయన తనయుడు ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్ భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈ శ్వేతసౌధానికి మహబూబ్ జ్ఞాపకార్థం మొదట మహబూబియా టౌన్ హాల్‌గా నామకరణం చేశారు. అదే రాష్ట్ర శాసనసభగా మారింది. అసెంబ్లీ భవనం ఫొటోతో పోస్టల్ స్టాంప్ 1913లో భవనం నిర్మాణం పూర్తి అయి ప్రజలకు అందుబాటులో రావడంతో ఈ భవనం ఫొటోతో ఏడో నిజాం సంస్థాన ప్రజల అందరికీ తెలిసేలా దీని ఫొటోతో పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. దీని విలువ అప్పటి రోజుల్లో ఒక అణాగా ఉండేది. -
జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: భూవివాదాల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూవివాదాలపై విచారణ జరిపి పరిష్కరించేందుకు ప్రతి జిల్లాకో ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సభ్యుడిగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. జిల్లా స్థాయిలో మూడంచెల్లో తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 16 వేల కేసులు పరిష్కారమయ్యే వరకు ఈ ట్రిబ్యునళ్లు పనిచేయనున్నాయి. ఆ తర్వాత అవసరాల మేరకు వీటి కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత సెప్టెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం–2020 తీసుకొచ్చింది. ఇనామ్‌తో పాటు రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం–1971 రద్దయిన నేపథ్యంలో వివిధ స్థాయిల్లోని రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 16,137 కేసులను ప్రభుత్వం అప్పట్లో సీసీఎల్ఏ (భూపరిపాలన ప్రధాన కమిషనర్)కు బదిలీ చేసింది. తాజాగా ఈ కేసులను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునళ్లకు అప్పగించింది. బదిలీ చేసిన నెల రోజుల్లోగా అన్ని కేసులను పరిష్కరించాలని ట్రిబ్యునళ్లకు గడువు విధించింది. అదనపు కలెక్టర్(రెవెన్యూ) పోస్టు ఖాళీగా ఉంటే, ఆయన స్థానంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ట్రిబ్యునల్ సభ్యుడిగా.. ఆ రెండు పోస్టులు ఖాళీగా ఉన్న సమయంలో డీఆర్వో సభ్యుడి గా వ్యవహరిస్తారని స్పష్టం చేసింది. చివరకు కలెక్టర్లకే బాధ్యతలు రిటైర్డ్ జిల్లా జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో తాత్కాలిక రెవెన్యూ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైరైన ఐఏఎస్‌లతో ఈ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకున్న అవకాశాలను సైతం ప్రభుత్వం పరిశీలించింది. ఇలా కొంతమంది అధికారుల జాబితాలను సైతం ప్రభుత్వం సిద్ధం చేసింది. చివరకు జిల్లా కలెక్టర్లకే ఈ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రిబ్యునళ్ల ప్రత్యేకతలు.. జిల్లా కేంద్రంలోనే కాకుండా అవసరమైతే రెవెన్యూ డివిజనల్, మండల కేంద్రాల్లో కేసుల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ సమావేశం కావచ్చు. ట్రిబ్యునళ్ల కోసం జిల్లా స్థాయిలో అందుబాటులో ఉండే ఉద్యోగుల సేవలనే వినియోగించుకోవాలి. ప్రతి కేసుకు సంబంధించిన తీర్పులను కంప్యూటరైజ్డ్ చేయాలి. కేసు పురోగతిని ట్రాక్ చేసి పరిష్కరించేందుకు వీలుగా కేసుకు సంబంధించిన మెటా డేటాను జాగ్రత్తపర్చాలి. సిస్టం ద్వారా ప్రతి కేసుకు నంబర్ కేటాయించాలి. తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం–2020లోని సెక్షన్ 13లో పేర్కొన్న అధికారాలన్నీ ట్రిబ్యునల్‌కు సంక్రమిస్తాయి. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ ట్రిబ్యునల్‌కు బదలాయించాలి. చట్టం మేరకు ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులు అమలవుతాయి. కేసుల పరిష్కారం అనంతరం వీటికి సంబంధించిన రికార్డులను జిల్లా కలెక్టరేట్లో నిబంధనల ప్రకారం భద్రపర్చాలి. -
పీసీసీ: కలకలం రేపిన రేవంత్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ’పట్టు‘విడుపులు లేని నాయకుల పంతాలతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలలో ఎవరో ఒకరిని ఈ పదవి వరిస్తుందనే చర్చ నిన్నటి వరకు జరగ్గా, ఇప్పుడు అనూహ్యంగా మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ ఇద్దరూ కాకుండా మధ్యేమార్గంగా రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు టి.జీవన్‌రెడ్డి, కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మర్రి శశిధర్‌రెడ్డిల పేర్లు ముందు వరుసలోకి వచ్చాయి. ఒకదశలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు ఖరారైందన్న ప్రచారం కూడా జరి గింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడొచ్చంటూ మంగళవారమంతా హడావుడి జరిగింది. కానీ, సాయంత్రానికి అలాంటిదేమీ లేదని అధిష్టానం తేల్చడంతో కాంగ్రెస్ శ్రేణులు నిట్టూర్చాయి. సామాజిక సమీకరణలు, పంతాలు, పట్టింపులు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, త్వరలో జరగబోయే ఎన్నికలు లాంటి అంశాల నేపథ్యంలో అసలు టీపీసీసీకి ఎవరిని ఎంపిక చేయాలన్నది పార్టీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి నాటికల్లా వ్యవహారాన్ని తేల్చాలా... నాగార్జునసాగర్ ఉపఎన్నిక వరకు వేచి ఉండాలా అనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలతో...! వాస్తవానికి సోమవారం వరకు టీపీసీసీ అధ్యక్ష వ్యవహారంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్దగా చర్చ ఏమీ లేదు. కానీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తానే టీపీసీసీ అధ్యక్షుడిననే ధీమాతో ఉన్న రేవంత్ ఉన్నట్టుండి తనకు అధ్యక్ష పదవే ముఖ్యం కాదని, ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదంటూ చేసిన వ్యాఖ్యలతో అసలు పార్టీలో ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే జీవన్‌రెడ్డి అధ్యక్షుడిగా, రేవంత్ ప్రచార కమిటీ చైర్మన్‌గా మంగళవారం అధికారిక ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జరిగింది. అసలేం జరిగింది? టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ఫర్వాలేదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వర్గాలు పలురకాలుగా విశ్లేషించాయి. పీసీసీ అధ్యక్ష పదవే కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అధిష్టానానికి ఆయన వెసులుబాటు కల్పించారని, ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తాననే సంకేతాలు ఇచ్చారనే చర్చ జరిగింది. మరోవైపు అధిష్టానం నుంచి అలాంటి సంకేతాలు ఉన్నందునే రేవంత్ అలా మాట్లాడారని, ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఖరారైందనే ప్రచారం సాగింది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుని ఎంపికపై గురువారం నుంచి కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించనున్న నేపథ్యంలో... ఈలోపే తెలంగాణ పీసీసీని తేల్చేస్తుందనే అంచనాతో ఈ ఊహాగానాలు సాగాయి. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, మధుయాష్కీ గౌడ్లకు ఫలానా పదవులంటూ రాష్ట్రంలో చర్చ జరిగిందని ఏఐసీసీ వర్గాలు చెపుతున్నాయి. సామాజిక సమీకరణాల మాటేమిటి? ఒకవేళ టీపీసీసీ అధ్యక్షునిగా జీవన్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ఖరారు చేసిన పక్షంలో రెండు కీలక పదవులూ ఒకే సామాజిక వర్గానికి దక్కుతాయని, అది చాలా నష్టానికి కారణమవుతుందనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితుల ప్రకారం పీసీసీ అధ్యక్షుడు లేదా ప్రచార కమిటీ చైర్మన్ పదవుల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి తప్పకుండా కేటాయించాలని, అయితే రెండో పదవిని మాత్రం బీసీ లేదా ఎస్సీలకు కేటాయించాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. నిన్నటి వరకు టీపీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏం చేస్తారన్న దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయనకు సీడబ్ల్యూసీలో ఆహ్వానితుడిగా అవకాశం ఇస్తారనే ప్రచారం ఉన్నా... ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కాదని ఆయనకు కేటాయించే పరిస్థితి లేదని అంటున్నారు. ఒకవేళ కోమటిరెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తే టీపీసీసీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీలోని ఇతర సామాజిక వర్గ నేతలను ఎక్కడ సర్దుబాటు చేయాలన్నది అధిష్టానానికి రిస్క్ ఫ్యాక్టర్‌గా మారిందని టీపీసీసీలో కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో బీజేపీ దూసుకువస్తోంది. ఆ పార్టీకి బీసీ అధ్యక్షుడు ఉన్నారు. టీఆర్ఎస్ కూడా బీసీలకు అనేక సమయాల్లో ప్రాధాన్యం ఇచ్చింది. మేం బీసీ, ఎస్సీలను విస్మరిస్తే నష్టమే జరుగుతుంది. తేడా వస్తే పునాదులే కదులుతాయి.. ఆచితూచి అడుగేయాలి’అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. సాగర్ ‘గుబులు’ మరోవైపు టీపీసీసీ అధ్యక్ష ఎన్నిక వ్యవహారాన్ని తేల్చకపోవడానికి నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కారణమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అసంతృప్తులు, అలకలతో పార్టీ నేతలు సహకరించకపోతే... పార్టీకి నష్టం జరుగుతుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జరుగనున్న సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవకపోతే రాష్ట్రంలో ఇక ఆ పార్టీ పరిస్థితి అంతేననే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సాగర్ ఎన్నిక పూర్తయ్యేవరకు టీపీసీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానాన్ని అడిగినట్టు గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా తన జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం ఈ ఎన్నికల్లో తనకు అవసరమని, ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని జానా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరి వారంలో ఈ ఉపఎన్నిక జరుగుతుందన్న అంచనా మేరకు అప్పటివరకు ఈ తలనొప్పి వ్యవహారాన్ని వాయిదా వేద్దామా..? లేక ముందుగా అనుకున్నట్టు సంక్రాంతి లోపు తేల్చేద్దామా? అనే తర్జనభర్జనలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. జీవన్‌రెడ్డికి అభినందనల వెల్లువ కాగా టీపీసీసీ అధ్యక్షుడిగా జీవన్‌రెడ్డి పేరు ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. మంగళవారం ఆయన పుట్టినరోజు కూడా కావడంతో జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి అభిమానులు బారులు తీరారు. అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడి విషయంలో ఇంతవరకు తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఎవరికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాల్సిందేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష వ్యవహారంలో ఇంకా ఏమీ తేలలేదని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
ఇంటింటికీ ఇంటర్నెట్
ఉట్నూర్(ఖానాపూర్): రాబోయే రోజుల్లో జిల్లాలో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 2022 నాటికి టీ–ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రైట్ ఆఫ్ వే అనుమతులు ఇవ్వడంతో ప్రతి ఇంటికి హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు మమ్మురం చేసింది. ఆయా ప్రాంతాల్లో టీఫైబర్ ఏర్పాటు చేసే పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్(పీవోపీ)లకు ప్రభుత్వం కార్యాలయాల నిర్మాణాల కోసం ఉచితంగా స్థలం కేటాయించనుంది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఆధునిక సాంకేతికత అభివృద్ధి, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఇంటర్నెట్ సేవలు కీలకంగా మారాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం టీ ఫైబర్ గ్రీడ్ ద్వారా ఇంటింటా ఇంటర్నెట్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా రాష్ట్ర హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు, గ్రామాలు, వ్యక్తిగత గృహాలు, ఇతర వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ కేబుల్ వేయనున్నారు. కేబుల్ వేసే బాధ్యతలను ఎల్అండ్టీ, స్టెరిలైట్ టెక్పాలజీస్ లిమిటెడ్‌లకు టెండర్ల ద్వారా అప్పగించారు. ఈ పనులను 2022 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థలు కేబుల్స్‌ను భూగర్భం(అండర్ గ్రౌండ్)లో, స్తంబాల (ఏరియల్) ద్వారా విస్తరించనున్నారు. అవసరమైనచోట మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా వేసిన హై డెన్సిటీ పాలిఇథైలిన్ పైపుల ద్వారా కేబుల్ వేయనున్నారు. ఫైబర్ కేబుల్స్ పనులు పూర్తి కాగానే ప్రతి ఇంటికి హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వనుంది. ఇందుకోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రైట్ ఆఫ్‌వే ఆదేశాలు జారీచేసింది. మొదట గ్రామ పంచాయతీలకు.. జిల్లాలో 18 మండలాలు, 468 గ్రామపంచాయతీలు, 508 రెవెన్యూ గ్రామాలు, 2,02,954 నివాస సముదాయాలు ఉన్నాయి. ప్రభుత్వం మిషన్ భగీరథ పైప్లైన్లతో పాటు ఇంటర్నెట్కు సంబంధించిన ఫైబర్ కేబుల్ పైపులైన్ వేశారు. మొదటి విడతలో అన్ని గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు పనులు ప్రారంభించింది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపిండ్ యార్డులు, నర్సరీలు, హరిత వనం, తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. ఈ పనులకు సంబందించిన నివేదికలను పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా పొందుపర్చాల్సి ఉంది. అదీకాక గ్రామాల్లో జనన, మరణ వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్లైన్ సేవలు అత్యవసరం అయ్యాయి. అయితే పలు గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగాలేక పంచాయతీ కార్యదర్శులు తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ల ద్వారా సమాచారాన్ని మండల పరిషత్ కార్యాలయాలకు పంపిస్తే కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్లైన్లో రికార్డు చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం టీ ఫైబర్ ద్వారా మొదట గ్రామ పంచాయతీ కార్యాలయాలకు అటు తర్వాత నివాసాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టింది. ఆదేశాలు రాగానే చర్యలు జీపీలకు ఇంటర్నెట్ సౌకర్యంపై పూర్తిస్థాయిలో ఆదేశాలు రాగానే తగిన చర్యలు చేపడుతాం. ఇంటర్నెట్ వసతుల కల్పనకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనులు చేయాల్సి ఉంటుంది. టీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో కిందిస్థాయి నుంచి అధికారులు నిర్వహించే విధుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ఆన్లైన్ పనులు వేగంగా జరుగుతాయి. – శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి -
తెలుగు గడ్డపై అశోకుడు కాలుమోపాడా?
సాక్షి, హైదరాబాద్: భారత ఉపఖండాన్ని అత్యద్భుతంగా ఏలిన మౌర్య రాజ్య చక్రవర్తి అశోకుడు మన ప్రాంతంలో కాలుమోపాడా?.. ఇప్పటివరకు పెద్దగా ఆధారాల్లేవు. గతంలో తెలుగుగడ్డపై అశోకుడి కాలం నాటి వందలకొద్దీ నాణేలు లభించాయి తప్ప ఎక్కడా ఆయన పర్యటన జాడలు బయల్పడలేదు. కానీ, మంజీరా నది ఏడుపాయల ప్రాంతంలో ఉన్న కుల్చారం వద్ద ఇటీవల పరిశోధకులకు లభించిన టెర్రకోట ముక్కపై ఉన్న ‘దేవానా’ అనే బ్రాహ్మీ లిపి అక్షరాలు దీనిపై ఆసక్తి పెంచుతున్నాయి. దేవానాంపియ (దేవానాంప్రియ) అనేది అశోకుడి బిరుదు. దేవుడికి ప్రీతికరమైన వ్యక్తిగా తననుతాను అశోకుడు అభివర్ణించుకున్నాడని అంటారు. దేశవ్యాప్తంగా చాలా ఏళ్లనుంచి లభిస్తున్న శాసనాల్లో దేవానాంపియ పదం తప్ప ఎక్కడా అశోకుడి పేరుండదు. దీంతో తొలుత ఆ పేరుతో రాజు ఉండేవాడని చరిత్రకారులు భావించారు. కానీ హైదరాబాద్ సంస్థానంలో భాగమైన రాయచూరు సమీపంలోని మస్కీలో 1915లో లభించిన శాసనంలో దేవానాంపియ అనేది తన పేరుగానే అశోకుడు పేర్కొన్నట్టుగా ఉన్న శాసనం లభించింది. బ్రిటిష్ ఇంజనీర్ బీడన్ ఈ శాసనాన్ని చూడగా, నాటి ఎపిగ్రఫిస్ట్ కృష్ణశాస్త్రి నిపుణుల ద్వారా దాని గుట్టు విప్పారు. దీంతో దేవానాంపియ అంటే అశోకుడే అని ప్రపంచానికి తెలిసింది. ఏపీలోని అమరావతి, కర్నూలు సమీపంలోని రాజులమందగిరి, అనంతపురం దగ్గరి ఎర్రగుడిలో అశోకుడి శాసనాలు లభించాయి. తాజాగా, దేవానాంపియ పదంలో ‘దేవానా’ అన్న అక్షరాలున్న టెర్రకోట ముక్క కుల్చారం సమీపంలో లభించింది. మిగతా అక్షరాలున్న భాగం విరిగిపోయి ఈ ముక్క మాత్రమే మిగిలి ఉంటుందని దాన్ని గుర్తించిన శంకర్‌రెడ్డి, నాగరాజు, అరుణ్‌కుమార్‌తో కూడిన బృందానికి నేతృత్వం వహించిన పరిశోధకుడు ఎం.ఎ.శ్రీనివాసన్ తెలిపారు. ఇది క్రీ.పూ.3వ శతాబ్దానికి చెంది ఉంటుందని తెలిపారు. తవ్వకాలు జరిపితే.. తెలంగాణ ప్రాంతంలో మౌర్యుల కాలం నాటి వందలకొద్దీ నాణేలు గతంలో లభించాయి. 1921లో కరీంనగర్ ప్రాంతంలో ఒకేసారి 420 పంచ్‌మార్క్‌డ్ నాణేలు దొరికాయి. మిగతా ప్రాంతాల్లోనూ మరిన్ని లభించాయి. కానీ అశోకుడి బిరుదుతో ఉన్న టెర్రకోట లభించటం ఇదే తొలిసారి. అది బౌద్ధ స్తూపానికి చెందిన ఫలకంగా భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే స్తూపం ఆనవాళ్లు లభించవచ్చని అభిప్రాయపడుతున్నారు. తన హయాంలో అశోకుడు వేలసంఖ్యలో స్తూపాలు వేయించాడు. ఈ ప్రాంతానికి ఆయన వచ్చినట్టు గుర్తుగా స్తూపం ఉండి ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రాంతానికి కిలోమీటరు దూరంలో శాతవాహనుల కాలానికి చెందినదిగా భావిస్తున్న రాతిగుహ బయల్పడింది. అక్కడి రాతిగుండుపై ‘హెనమో బుద్ధేయ’, ‘ధర్మ’, ‘హే జమ’ అన్న పదాలు బ్రాహ్మీ లిపిలో లిఖించి ఉన్నాయి. -
అక్రమ కట్టడాలు వాళ్ల హయాంలోనివే
సాక్షి, హైదరాబాద్ : చరిత్రలో ఎన్నడూ చూడని భారీ వరదలు వచ్చాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమీక్షలో ప్రసంగించిన ఆయన అక్రమ కట్టడాల వల్లే వరదలు వచ్చాయని విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇప్పడు ఆరోపణలు చేస్తోన్న నేతల హయాంలోనే అక్రమ కట్టడాలు నిర్మించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కట్టిన భవనాలన్నీ చట్టానికి లోబడి రూల్స్ ప్రకారమే కట్టిన కట్టడాలని తెలిపారు. వరద ముంపు ప్రజలకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు గ్రేటర్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. వరదల్లో నష్టపోయిన ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారిని ఆదుకుంటుందన్నారు. (ఇల్లు కోల్పోయిన వారికి రూ.లక్ష సాయం : కేసీఆర్) 1908 తర్వాత మళ్లీ అలాంటి వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజల్లోనూ ఉంటున్నారని తెలిపారు. 80మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని కేటీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ముఖ్యమంత్రి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. మరో మూడు, నాలుగు రోజుల పాటు వర్షసూచన ఉందని, ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. వరదల్లో ఉన్న ప్రజల కోసం మంత్రులతో సహా కార్పొరేటర్లు 24 గంటలు పనిచేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 550 కోట్లు నష్ట పరిహారం ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. (బాధితులకు ఆర్థిక సాయం) -
మలేషియాలో క్షమాభిక్ష
మోర్తాడ్(బాల్కొండ) : పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధిగాంచిన మలేషియాలో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులు సొంత గడ్డకు వెళ్లిపోవడానికి అక్కడి ప్రభుత్వం ఆమ్నెస్టీ(క్షమాభిక్ష)ను అమలు చేస్తోంది. పది నెలల క్రితం ఆమ్నెస్టీని అమలులోకి తీసుకురాగా ఈనెలాఖరుతో ముగిసిపోనుంది. మలేషియా ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ గత మే 31తోనే ముగిసింది. అయితే మలేషియా ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడగించడంతో ఈనెలాఖరు వరకు క్షమాభిక్ష కొనసాగనుంది. పర్యాటకుల పాలిట స్వర్గధామమైన మలేషియాలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు ఏజెంట్లు తెలంగాణ జిల్లాలకు చెందిన నిరుద్యోగులను తరలిస్తున్నారు. మలేషియాలో వర్క్ వీసాలకు బదులు విజిట్ వీసాలనే ఏజెంట్లు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. మలేషియాలో పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తుండటంతో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారు భయంతో దాక్కునాల్సి వస్తోంది. విజిట్ వీసాలపై మలేషియాలో అడుగు పెట్టిన వారికి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, సూపర్మార్కెట్లు, ఇతర వాణిజ్య సంస్థలలో పని కల్పించడం లేదు. దీంతో వారు పామోలిన్ తోటలలోనే రహస్యంగా పని చేయాల్సి వస్తోంది. పామోలిన్ తోటలలో పని చేసే వారికి పాములు, తేళ్ల బెడద తీవ్రంగా ఉంటుంది. మలేషియాలో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణ కార్మికుల సంఖ్య దాదాపు రెండువేల వరకు ఉంటుందని భారత హైకమిషన్ అధికారులు అంచనా వేసి వెల్లడించారు. క్షమాభిక్షను వినియోగించుకుని సొంత గడ్డకు వచ్చేవారు రూ.8 వేల జరిమానా చెల్లించి, సొంతంగా టిక్కెట్‌ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. క్షమాభిక్ష అమలు లేని సమయంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారు ఇంటికి రావాలంటే భారీ మొత్తంలో జరిమానా చెల్లించడమే కాకుండా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల క్షమాభిక్ష సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వచ్ఛంద సంఘాల నాయకులు కోరుతున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం.. మలేషియాలో ఆమ్నెస్టీ అమలు నేపథ్యంలో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మలేషియాలో పర్యటిస్తుంది. టీపీసీసీ గల్ఫ్ కో ఆర్డినేటర్ నంగి దేవెందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సభ్యులు మూడు రోజుల నుంచి మలేషి యాలో తెలంగాణ కార్మికులు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంగి దేవెందర్‌రెడ్డి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. మలేషియాలో క్షమాభిక్ష అమలు విషయంపై ఎవరికీ అవగాహన లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్త శుద్ది లేదని ఆరోపించారు. మలేషియాలో ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కార్మికులే ఎక్కువ మంది ఉన్నారని వీరంతా విజిట్ వీసాలపై వచ్చి కష్టాలు పడుతున్నవారే అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి కార్మి కులను సొంతూర్లకు రప్పించే చర్యలను చేపట్టా లని డిమాండ్ చేశారు. చేతిలో డబ్బు లేక జరిమానా చెల్లించి, టిక్కెట్ కొనుక్కొనే పరిస్థితి కార్మికులకు లేదని తెలిపారు. ప్రభుత్వమే టిక్కెట్లను ఇప్పించి జరిమానాకు సంబంధించిన సొమ్మును జమ చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్షమాభిక్షకు ఎక్కువ సమయం లేదని అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించి తెలంగాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
ఉద్రిక్తతకు దారి తీసిన బతుకమ్మ ఉత్సవం
ఏపీ ఎన్జీవోస్లో టీ, ఆంధ్రా ఉద్యోగుల వాగ్వాదం హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఆంధ్రా, తెలంగాణ ఉద్యోగుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బుధవారం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకోవడానికి తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఏపీఎన్జీవోస్ కార్యాలయానికి వచ్చారు. వారిని గేట్ లోపలికి రానివ్వకుండా ఆంధ్రా ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. సమాచారం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో తెలంగాణ ఉద్యోగులు గేటు బయట రోడ్డుపైనే బతుకమ్మ ఆడారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని పోలీసులు భాగ్యనగర్ టీఎన్జీవోస్ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణగౌడ్, కార్యదర్శి పి. బలరామ్, అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.ప్రభాకర్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్‌రావు, విద్యానంద్, రమాదేవి తదితరులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. సాయంత్రంవారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో ఇంకా ఆంధ్రా అధికారుల ఆగడాలకు అంతులేకుండా పోతోందన్నారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. -
ఆనాడే పోరాడారు..
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రజాకార్ల నిరంకుశ పాలనకు ఎదురొడ్డారాయన. ఆంధ్రలో హైదరాబాద్ రాష్ర్ట విలీనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. తెలంగాణ స్వయంప్రతిపత్తికి ఆ రోజుల్లోనే పట్టుబట్టిన నాయకుడే కొండా వెంకటరంగారెడ్డి. సమైక్య రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేవీ రంగారెడ్డి 1890 డిసెంబర్ 12న మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలో జన్మించారు. ఉర్దూ భాషలో ప్రావీణ్యుడైన కొండా వకీలుగా పనిచేశారు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా వ్యవహరించిన రంగారెడ్డి అప్పట్లో ఆ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాలనే ప్రతిపాదనకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వయం పాలనకు అవకాశమివ్వకుండా ఆంధ్రలో కలపాలనే ఆలోచనను విరమించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి చేశారు. స్వయంప్రతిపత్తి కోసం యువత ప్రాణాలర్పించడంతో చలించిన కొండా మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 ఫిబ్రవరి 26న రాష్ట్ర విలీన సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో కీలక సభ్యుడిగా వ్యవహరించారు కేవీ రంగారెడ్డి. ఈయన మేనల్లుడే మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. మామ స్మృత్యర్థం చెన్నారెడ్డి 1978లో ‘రంగారెడ్డి’ జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ఆ రోజుల్లోనే బలంగా చాటిన కొండా వెంకటరంగారెడ్డి 123 జయంతి గురువారం. ప్రత్యేక రాష్ట్ర కల సాకారమవుతున్న వేళ ఆయనకిదే నిజమైన నివాళి అని చెప్పుకోవచ్చు. -
జిల్లావ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మల దహనం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన నేపథ్యం లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొద్ది రోజు లుగా మౌనం పాటించారు. గురువారం ఆయ న విలేకరుల సమావేశంలో సమైక్య స్వరాన్ని వినిపించారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణవాదులు తీవ్రస్థాయిలో ఆయనపై విరుచుకుపడ్డారు. శుక్రవారం టీఆర్ఎస్, బీజేపీ, విద్యార్థి సంఘాలు, రాజకీయ జేఏసీ, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించి కూడళ్ల వద్ద దహనం చేశారు. కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, డిచ్పల్లి, బాల్కొం డ, వేల్పూర్, బోధన్, నిజామాబాద్, జుక్కల్ తదితర ప్రాంతాల్లో ఆందోళనకారు లు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించా రు. విద్యుత్, సాగునీరు, ఉద్యోగాలు, అభివృద్ధి విషయాల్లో సీఎం మాట్లాడిన తీరుపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. రాష్ట్రం విడిపోతే తెలంగాణకే నష్టం అన్నట్లుగా సీఎం అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. నిజామాబాద్ నగరంలో టీఆర్ఎస్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద నాయకులు, కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మకు ఉరివేశారు. టీఆర్ఎస్ యువజన విభాగం, టీఆర్ఎస్వీ ల ఆధ్వర్యంలో వేరువేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బోధన్‌లో టీఆర్ఎస్, టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యం లో, వేల్పూర్, కామారెడ్డి, నిజామాబాద్ మండలంలోని ధర్మారం(బి), సిరికొండ, ఎల్లారెడ్డిల్లో టీఆర్ఎస్, బీజేపీల ఆధ్వర్యంలో వేరువేరుగా సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు జరుగుతున్న సమయంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చర్యలను ఖండించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.