
'కేసీఆర్ భయంతోనే బాబు బెజవాడలో మకాం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెజవాడలో ఉండటం వెనుక ఓటుకు నోటు కేసులో చీకటి ఒప్పందం ఉందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. పదేళ్ల పాటు హైదరాబాద్లోనే ఉంటానని గతంలో చెప్పిన బాబు ఇప్పుడు పది రోజుల్లో ఉద్యోగులు బెజవాడకు రావాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
అప్పట్లో సెక్షన్ 8 అమలు చేయాలని పదే పదే కోరిన బాబు ఇప్పుడు ఇంత హడావుడిగా ఉద్యోగులను బెజవాడకు రావాలని కోరడం వెనుక కారణమేంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భయంతోనే బాబు బెజవాడలో ఉంటున్నారని అంబటి ఎద్దేవా చేశారు.