
'కేసీఆర్, బాబులు భేటీ మంచిదే'
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు భేటీ మంచిదేనని పెద్దపల్లి ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ శనివారం హైదరాబాద్లో అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగుల పంపిణీ విషయంలో తమ విధానంలో మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే తాము ఫీజు చెల్లిస్తామన్నారు. ఈ నెల 19న ప్రభుత్వం నిర్వహించనున్న సర్వేపై వివాదం చేయడం సరైనది కాదని తెలిపారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాబు, చంద్రశేఖర రావులు ఆదివారం మధ్యాహ్నం భేటీ కానున్నారు. అందుకు రాజ్భవన్ వేదిక కానుంది. గవర్నర్ నరసింహన్ చోరవతో వారిరువు కలవనున్న సంగతి తెలిసిందే.