
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. కోవిడ్–19 నివారణ చర్యలపై ఆదివారం సమీక్ష జరుగుతుండగా ఈ విషయాన్ని సీఎం అధికారులకు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, వాటి అమలుపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అలాగే, లాక్‌డౌన్ పరిణామాలు, దీని తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపైన వారిద్దరూ చర్చించారు.
కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా అమిత్ షాకు వివరించారు. రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి మిలియన్ జనాభాకు 1,274 చొప్పున అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉన్నామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి తెలిపారు.